Site icon HashtagU Telugu

Remittance Tax : అమెరికాలోని భారతీయులకు ట్రంప్ శుభవార్త.. రెమిటెన్స్ పన్ను 1 శాతానికే పరిమితం!

Remittance Tax

Remittance Tax

Remittance Tax : అమెరికాలో నివసిస్తున్న లక్షలాది ప్రవాస భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఊరట కల్పించింది. విదేశాలకు పంపే నగదుపై (రెమిటెన్స్) విధించే పన్నును 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం భారతీయులకు ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా స్వదేశంలోని కుటుంబాలకు డబ్బు పంపే వారికి. ఈ తగ్గింపు వల్ల భారతీయులు ఏటా రూ.7 లక్షల కోట్ల వరకు పంపే నిధులపై పన్ను భారం తగ్గి, ఎక్కువ డబ్బు కుటుంబాలకు చేరనుంది.

ఈ పన్ను తగ్గింపు ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’లో భాగంగా ప్రతిపాదించబడింది. ఈ బిల్లు అమెరికా సెనెట్‌లో స్వల్ప మెజారిటీతో (51-49) ఆమోదం పొందింది. తొలుత 5 శాతంగా ప్రతిపాదించిన పన్ను, ప్రవాసీయుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో 3.5 శాతానికి, ఆ తర్వాత 1 శాతానికి తగ్గింది. ఈ బిల్లు ప్రతినిధుల సభలో కూడా ఆమోదం పొంది, అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారనుంది.

Pawan Kalyan : మరోసారి గొప్ప మనసు చాటుకున్న పవన్.. పాకీజాకు ఆర్ధిక సాయం

ఈ నిర్ణయం వల్ల బ్యాంకు ఖాతాలు, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కేవలం మనీ ఆర్డర్, క్యాషియర్ చెక్కుల వంటి మార్గాల ద్వారా పంపే నగదుపై మాత్రమే 1 శాతం పన్ను విధించబడుతుంది. ఇది ఆర్థిక సంస్థల ద్వారా డబ్బు పంపే వారికి గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది.

ప్రస్తుతం అమెరికా నుంచి భారత్‌కు ఏటా 118.7 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ వస్తున్నాయి. 5 శాతం పన్ను విధిస్తే ఏటా రూ.13,600 కోట్ల వరకు పన్ను భారం పడేది. ఇప్పుడు 1 శాతం వద్ద ఈ భారం రూ.2,720 కోట్లకు తగ్గుతుంది. దీనివల్ల ప్రవాసీయులు రూ.10,880 కోట్లు ఆదా చేయగలుగుతారు.

ఈ తగ్గింపు భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపనుంది. ఎక్కువ డబ్బు కుటుంబాలకు చేరడం వల్ల వినియోగం, పొదుపు పెరిగి, రూపాయి విలువ స్థిరీకరణకు దోహదపడుతుంది. అమెరికాలోని భారతీయ విద్యార్థులు, హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డు హోల్డర్లు ఈ ఊరటతో ఆర్థిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందనున్నారు. ట్రంప్ సర్కారు నిర్ణయంతో ఇప్పటికీ కొందరు ఎన్నారైలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకుంటే అమెరికాలో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ నిశ్చల స్థితిలో లేకపోవడం, ద్రవ్యోల్భణం విపరీతంగా పెరిగిపోవడం,జాబ్స్ దొరకడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే బైడెన్ సర్కారున అమెరికన్ పౌరులు ఇంటికి పంపించిన విషయం తెలిసిందే.

CM Chandrababu : పింఛన్ల కోసమే నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు: సీఎం చంద్రబాబు