US ELECTIONS: ట్రంప్ గెలిస్తే ఫస్ట్ సంతకం దేనిపైనో తెలుసా..?

US ELECTIONS: తనను గెలిపిస్తే..అధికారంలోకి రాగానే స్కూళ్లలో క్రిటికల్ రేస్ థియరీ లెసన్స్, ట్రాన్స్ జెండర్ వెర్రిని నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై మొదటి సంతకం చేస్తానని హామీ

Published By: HashtagU Telugu Desk
Donald Trump First Signatur

Donald Trump First Signatur

అమెరికా అధ్యక్ష ఎన్నికలు (2024 US Presidential Election) సమీపిస్తోన్న వేళ రిపబ్లికన్, డెమోక్రటిక్ అభ్యర్థులు (Republican, Democratic Candidates) ప్రచారంలో జోరు పెంచారు. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Republican Presidential Candidate Donald Trump) అయితే భారీ హామీలు ఇస్తూ..తనదైన ప్రచారం తో వార్తల్లో నిలుస్తున్నారు.

మొన్నటికి మొన్న పెన్సిల్వేనియాలోని మెక్డొనాల్డ్ స్టోర్లో పనిచేసి వైరల్ గా మారారు. స్టోర్లో స్వయంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తయారుచేసి వాటిని కస్టమర్లకు అందించారు. దీంతో వేలాది మంది ట్రంప్ సపోర్టర్లు అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా తనను గెలిపిస్తే..అధికారంలోకి రాగానే స్కూళ్లలో క్రిటికల్ రేస్ థియరీ లెసన్స్, ట్రాన్స్ జెండర్ వెర్రిని నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. ‘దేవుడు స్త్రీ, పురుషులుగా రెండే జెండర్స్ సృష్టించాడు. అందుకే విషపూరితమైన జెండర్ ఐడియాలజీని నిషేధిస్తాను. మహిళల క్రీడలకు మగవాళ్లను దూరంగా ఉంచుతాను. పిల్లల్లో లింగమార్పిడి చేయకుండా చట్టం తీసుకొస్తాను’ అని హామీల వర్షం కురిపించారు.

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. ఈ ఎన్నికలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ ఎన్నికల ద్వారా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిని మరియు ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 2024 అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024న జరుగనున్నాయి. ప్రైమరీలలో ఎక్కువ మంది మద్దతు పొందిన అభ్యర్థిని అధికారికంగా పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తారు. డెమోక్రటిక్ మరియు రిపబ్లికన్ పార్టీలు తమ కన్వెన్షన్లలో ఉపాధ్యక్ష అభ్యర్థిని కూడా ప్రకటిస్తాయి.

Read Also : Salman Khan : రూ.5 కోట్లు ఇవ్వు.. సల్మాన్‌ ఖాన్‌కు వార్నింగ్.. కూరగాయల వ్యాపారి అరెస్ట్

  Last Updated: 24 Oct 2024, 11:43 AM IST