చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌!

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వడం వల్ల చైనా భారీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ నేరుగా చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

Trump Warns China: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను కఠిన పదజాలంతో హెచ్చరించారు. ఇరాన్‌కు ఆయుధాలను సరఫరా చేయవద్దని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆయన తెగేసి చెప్పారు. ఒకవేళ ఇరాన్ దారికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఆ సమయంలో చైనా, జిన్‌పింగ్ పెద్ద చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయని, ఒకవేళ ఒప్పందం కుదరకపోయినా అమెరికాకు వచ్చే నష్టమేమీ లేదని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇరాన్ యుద్ధంలో అమెరికాదే విజయం: ట్రంప్ ధీమా

ఇరాన్‌పై జరుగుతున్న పోరాటంలో విజయం అమెరికాదేనని ట్రంప్ ఉద్ఘాటించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మాదే. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మందుపాతరలు వేసి ఉండవచ్చు. కానీ వాటిని తొలగించడానికి మా దగ్గర ‘మైన్ స్వీపర్లు’ సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ ఆ మార్గం ద్వారా చమురు, గ్యాస్ ట్యాంకర్లను అనుమతించాల్సిందే. ఆ మార్గాన్ని బ్లాక్ చేయడానికి అమెరికా ఒప్పుకోదు. ఇరాన్ మనుగడ సాగించాలంటే ఒప్పందం చేసుకోవాల్సిందే, లేదంటే వారిని నామరూపాలు లేకుండా చేస్తాం అని ట్రంప్ హెచ్చరించారు.

Also Read: Vishnu Priya : సోషల్ మీడియా లో విష్ణుప్రియ హాట్ ఫొటోస్..పోలీసులు కేసు నమోదు

చైనా ఆయుధ సరఫరా.. అమెరికా భద్రతకు ముప్పు

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వడం వల్ల చైనా భారీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ నేరుగా చెప్పారు. ఇరాన్‌కు చైనా ఆయుధాలు అందించడం అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని, ఇది పాకిస్థాన్‌లో జరుగుతున్న శాంతి చర్చలకు పెద్ద అడ్డంకి అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ శాంతి చర్చలు విఫలమైతే దానికి ఇరాన్‌తో పాటు చైనా కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

వచ్చే వారం ఇరాన్‌కు చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్?

యుద్ధంలో చైనా ఇరాన్‌కు సహాయం చేస్తోందని అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. అమెరికా యుద్ధ విమానాల ఖచ్చితమైన లొకేషన్లను ఇరాన్‌కు అందించడం ద్వారా చైనా పరోక్షంగా దాడులకు సహకరిస్తోంది. అంతేకాకుండా వచ్చే కొన్ని వారాల్లో చైనా నుండి ఇరాన్‌కు కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సీజ్‌ఫైర్ డీల్ కోసం ఇరాన్‌ను ఒప్పిస్తున్నట్లు నటిస్తూనే మరోవైపు ఆయుధాలు ఇచ్చి ఇరాన్ సైన్యాన్ని చైనా బలోపేతం చేస్తోంది.

అమెరికా విమానాలను కూల్చిన చైనా మిసైళ్లు!

భుజంపై నుండి ప్రయోగించే యాంటీ-ఎయిర్ మిసైల్ సిస్టమ్స్‌ను చైనా ఇరాన్‌కు పంపిందని అమెరికా ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఈ వ్యవస్థ ద్వారానే ఇరాన్ అమెరికాకు చెందిన F-15E యుద్ధ విమానాలను, బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేసింది. గత 20 ఏళ్లలో ఏ శత్రువు కూడా అమెరికా యుద్ధ విమానాలను తాకలేకపోయారని, కానీ ఈ ‘మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్’ (MANPADS) ద్వారా ఇరాన్ ఇది సాధించిందని అమెరికా గుర్తించింది. ఇరాన్ చైనాకు చెందిన అధునాతన HQ-9B సుదూర శ్రేణి క్షిపణి వ్యవస్థను వాడుతుండవచ్చని అంచనా. మార్చి 2026లో చైనా నుండి ఇరాన్‌కు వెళ్లిన రెండు నౌకల్లో రాకెట్ ఇంధన తయారీకి వాడే ‘సోడియం పర్క్లోరేట్’ ఉన్నట్లు సమాచారం.

  Last Updated: 12 Apr 2026, 11:39 AM IST