Trump Golf Course: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి 500 గజాల దూరంలో అనుమానాస్పదంగా ఏకే47 తుపాకీతో అక్కడ తిరిగాడు. దీంతో అతడిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు చెందిన ఒక టీమ్ వెంటనే ట్రంప్‌ను(Trump Golf Course) సేఫ్ ప్లేసుకు తరలించింది. మరో టీమ్ ఆ దుండగుడిని వెంబడించి పట్టుకుంది. అనంతరం నిందితుడిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రశ్నించగా.. ట్రంప్‌ను హత్య చేసేందుకు తాను గన్‌ను తీసుకొచ్చినట్లు చెప్పాడు. కాల్పులు జరిపేందుకు వచ్చిన వ్యక్తి పేరు ర్యాన్ వెస్లీ రౌత్ అని గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసు స్టేషనుకు తరలించారు.
Also Read :Minister Sridhar Babu Vs KTR : కేటీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
నిందితుడు ఎవరు ?
ట్రంప్‌పై కాల్పులు జరిపేందుకు యత్నించిన ర్యాన్ వెస్లీ రౌత్ నార్త్ కరోలినా వాస్తవ్యుడు. అతడు కన్‌స్ట్రక్షన్ పనిచేసేవాడు. గన్ వాడాలనే కోరిక ర్యాన్‌కు ఉండేదట. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం జరుగుతున్న వేళ ఈమేరకు తన మనసులోని మాటలను ఇటీవలే సోషల్ మీడియాలో ర్యాన్ వెస్లీ రౌత్ రాసినట్లు గుర్తించారు. ‘ఫైట్ అండ్ డై’ అని అతడు కామెంట్స్ పెట్టాడు.
ట్రంప్, బైడెన్, కమల ఏమన్నారు ?
ఈఘటన నేపథ్యంలో తన అభిమానులను ఉద్దేశించి ట్రంప్ ఒక ఈ-మెయిల్ చేశారు. తాను బాగానే ఉన్నానని ఆయన స్ఫష్టం చేశారు. ఏదీ తనను అడ్డుకోలేదని తేల్చి చెప్పారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. ట్రంప్‌పై హత్యాయత్నానికి పాల్పడేందుకు యత్నించిన వ్యక్తిని విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని స్పష్టం చేశారు. అలాంటి దాడులకు తెగబడే వారిని వదిలేది లేదన్నారు. ట్రంప్ సేఫ్‌గా ఉన్నారని తెలిసి సంతోషం కలిగిందని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ చెప్పారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు అమెరికాలో చోటు లేదని ఆమె తేల్చి చెప్పారు.