Trump – 689 Crores : ఆమెకు 689 కోట్లు ఇవ్వండి.. ట్రంప్‌కు కోర్టు ఆదేశం

Trump - 689 Crores : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వైపు రిపబ్లికన్ పార్టీ  అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో దూసుకుపోతుండగా.. మరోవైపు ఆయనను వివిధ కేసులు నీడలా వెంటాడుతున్నాయి. 

  • Written By:
  • Publish Date - January 27, 2024 / 07:58 AM IST

Trump – 689 Crores : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వైపు రిపబ్లికన్ పార్టీ  అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో దూసుకుపోతుండగా.. మరోవైపు ఆయనను వివిధ కోర్టు కేసులు నీడలా వెంటాడుతున్నాయి.  తాాజాగా న్యూయార్క్‌లోని  ఓ కోర్టు  ట్రంప్‌కు కీలక ఆదేశాలిచ్చింది. ట్రంప్ వల్ల మానసికంగా, శారీరకంగా నష్టపోవడంతో పాటు సామాజిక ప్రతిష్ఠను కోల్పోయానంటూ పిటిషన్ వేసిన రచయిత ఇ. జీన్ కరోల్‌కు  రూ.689 కోట్ల పరిహారం(Trump – 689 Crores) చెల్లించాలని న్యాయస్థానం ఆర్డర్ వేసింది.  మీడియా ఎదుట అసభ్య వ్యాఖ్యలతో, కోర్టులో తప్పుడు ఆరోపణలతో, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ట్రూత్‌’లో అబద్ధపు ప్రచారంతో తన పరువుకు నష్టం కలిగించినందుకు రూ.83 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని జీన్ కరోల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ పరిహారాన్ని కరోల్‌కు మంజూరు చేయడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join.

ఇక అంతకుముందు కోర్టు రూంకు ట్రంప్ స్వయంగా వచ్చి సాక్ష్యం చెప్పారు. ఈసందర్భంగా ట్రంప్ అతిగా మాట్లాడటాన్ని నివారించడానికి ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ధర్మాసనం అడిగే ప్రశ్నలకు ‘యస్’, ‘నో’ అని మాత్రమే సమాధానాలు చెప్పాలని ఆదేశించింది. దీంతో ఆయన అన్ని ప్రశ్నలకు యస్, నో అని మాత్రమే ఆన్సర్స్ ఇచ్చారు. అనంతరం కోర్టు నుంచి బయటికి వెళ్తూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను కోర్టులో విచారించిన తీరును చూస్తుంటే ఇది అమెరికా కాదేమో అనిపిస్తోంది. ఇది అమెరికా కాదు’’ అని చెప్పాడు. ఇక తీర్పు వెలువడిన తర్వాత ట్రంప్ స్పందిస్తూ..   ‘‘ఈ తీర్పు హాస్యాస్పదమైనది. దీనిపై పై కోర్టులో అప్పీల్ చేస్తా’’ అని ట్రంప్ ప్రకటించారు. 1996 సంవత్సరంలో ఒక డిపార్ట్‌మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో తనపై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రచయిత ఇ. జీన్ కరోల్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంలోనే ఇప్పుడు ఆమెకు పరిహారం ఇవ్వాలని ట్రంప్‌ను కోర్టు ఆదేశించింది.

Also Read :Fastest Triple Century :147 బాల్స్‌లో ట్రిపుల్ సెంచ‌రీ.. హైదరాబాదీ క్రికెటర్ వరల్డ్ రికార్డ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌నకు వరుసగా రెండో విజయం లభించింది. గత వారం అయోవా రాష్ట్ర ప్రైమరీలో విజేతగా నిలిచిన ఆయన… తాజాగా న్యూ హ్యాంప్‌షైర్‌లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మంగళవారం నిర్వహించిన  ప్రైమరీలో తన సమీప ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన నిక్కీ హెలీని ట్రంప్‌ ఓడించారు. నిక్కీకి మద్దతుగా నమోదైన ఓట్ల శాతం గణనీయంగా పెరగడం గమనార్హం. ప్రైమరీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఓటమి ఎదురైనప్పటికీ పార్టీ అభ్యర్థి ఖరారు పోరు నుంచి వైదొలగబోనని ఆమె స్పష్టంచేశారు. తొలుత ఈ పోటీలో 14 మంది నిలిచారని, ఇప్పుడు ట్రంప్‌ తర్వాత స్థానంలో ఉన్నది తానేనని నిక్కీ హెలీ తెలిపారు.