Trump – Musk : డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్ దశ తిరిగేలా ఉంది. తాను మళ్లీ అమెరికా అధ్యక్షుడినైతే ఎలాన్ మస్క్‌కు కేంద్ర క్యాబినెట్‌లో చోటు కల్పిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఒకవేళ ఆ పదవి ఇవ్వడం సాధ్యం కాకపోతే తన అడ్వైజర్‌గా మస్క్‌ను నియమించుకుంటానని ఆయన వెల్లడించారు. మస్క్ చాలా తెలివైన వ్యక్తి అంటూ ట్రంప్ కితాబిచ్చారు. అయితే ఎలాన్ మస్క్‌కు(Trump – Musk) షాకిచ్చే ఓ ప్రకటనను ట్రంప్ చేశారు. అదేమిటంటే.. ఎలక్ట్రిక్ కార్లపై ఇస్తున్న 7,500 డాలర్ల ట్యాక్స్ క్రెడిట్‌ను రద్దు చేస్తానని తెలిపారు. వాహన కంపెనీలకు ట్యాక్స్ క్రెడిట్‌లు ఇవ్వడం దేశ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదన్నారు. తాను పెట్రోల్ కార్ల తయారీ వైపు సానుకూలంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. మస్క్‌కు టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఉన్న సంగతి తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి ఆయన భారీ విరాళాన్ని కూడా అందించారు. తన సోషల్ మీడియా కంపెనీ ఎక్స్ వేదికగా ట్రంప్‌కు మస్క్ భారీ ప్రచారాన్ని కల్పిస్తున్నారు. ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడైతే.. ఎలాన్ మస్క్ కష్టానికి తగిన ఫలితం ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే ఇస్రో లాంటి అమెరికా ప్రభుత్వరంగ కంపెనీలతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీకి ఒప్పందాలు ఉన్నాయి ట్రంప్ అధికార పీఠంపైకి వచ్చాక.. మస్క్ వ్యాపారాల మరింత జోరు అందుకునే అవకాశాలు ముమ్మరంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కంపెనీ కార్యకలాపాల విస్తరణకు కూడా ట్రంప్ సాయం చేసే అవకాశం ఉంది. స్టార్ లింక్ అనే కంపెనీ ద్వారా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ఎలాన్ మస్క్ అందిస్తుంటారు. దాని వ్యాపారానికి కూడా మంచిరోజులు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read :World Mosquito Day : ‘ప్రపంచ దోమల దినం’..ఇవాళే ఎందుకు జరుపుకుంటారు?
ట్రంప్ గారు.. నేను రెడీ : మస్క్
తాను గెలిచాక ఏదైనా ఒక కీలకమైన పదవిని తప్పకుండా ఎలాన్ మస్క్‌కు ఇస్తానంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఆ అవకాశాన్ని అందుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ’కి సారథ్యం వహించేందుకు తాను రెడీగా ఉన్నట్లు మస్క్ స్పష్టం చేశారు. ఆ బాధ్యతల్లో తాను ప్రసంగిస్తున్నట్లుగా ఉన్న ఒక ఫొటోను కూడా మస్క్ పోస్ట్ చేయడం విశేషం. అమెరికా ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్ధీకరించి, వృథాను అరికట్టేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల తాను ట్రంప్ ఎదుట ప్రతిపాదించానన్నారు.
Also Read :Rains Alert : హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం.. ఏపీలో కూడా..
I am willing to serve pic.twitter.com/BJhGbcA2e0
— Elon Musk (@elonmusk) August 20, 2024