Site icon HashtagU Telugu

Trump Win : నిక్కీ హేలీకి షాకిచ్చిన ట్రంప్.. ఎన్నికల రేసులో ఏం జరిగిందంటే..

Trump Win

Trump Win

Trump Win :  ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నుంచి మరోసారి అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఆ రేసులో జోరుగా దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ వరుసగా నిర్వహించిన  నాలుగో ప్రైమరీ ఎన్నికలో ఆయన ​ విజయం సాధించారు. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీకి చెందిన మరో పోటీదారు నిక్కీ హేలీని ఆమె సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలోనూ సునాయాసంగా ఓడించారు. ఇప్పటికే లోవా, అయోవా, న్యూ హాంప్​షైర్​, నెవాడా రాష్ట్రాల ప్రైమరీల్లో ట్రంప్​ గెలుపొందారు. సౌత్​ కరోలినాకు రెండుసార్లు గవర్నర్‌గా పనిచేసినప్పటికీ అక్కడి నుంచి  నిక్కీ హేలీ గెలవలేకపోవడం గమనార్హం. దీంతో రిపబ్లిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో పోటీ చేసేందుకు అభ్యర్థిత్వం ట్రంప్‌నకే దాదాపు ఖాయమైపోయినట్లు అమెరికాలో మీడియాలో ప్రచారం జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

2024 నవంబర్​లో అధ్యక్ష ఎన్నికలు

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్దిత్వ పోటీ నుంచి తప్పుకోవాలని ట్రంప్ (Trump Win)​ వర్గం తనను డిమాండ్​ చేసిందని నిక్కీ హేలీ ఆరోపించారు. ట్రంప్​ వర్గం ఎంత ఒత్తిడి చేసినా.. తాను పోటీ నుంచి తప్పుకోలేదని స్పష్టంచేశారు.  మార్చి 5న (సూపర్ ట్యూస్​డే) జరిగే పలు రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో కూడా పోటీలో ఉంటానని  నిక్కీ హేలీ తేల్చి చెప్పారు. ఇప్పటివరకు 5 రిపబ్లికన్ పార్టీ ప్రైమరీల్లో విజయం సాధించిన ట్రంప్..  అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో ముందుంజలో ఉన్నారనేది విస్పష్టం. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముందున్నారు. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల  ప్రైమరీ ఎన్నికలు  ముగిసి.. ఆ రెండు పార్టీల తరఫున అభ్యర్థులు ఖరారయ్యాక..  2024 నవంబర్​లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.

Also Read : Asha Shobana : ట్రెండింగ్‌లో శోభనా ఆశ.. ఎవరామె ?

ట్రంప్​ను వెంటాడుతున్న కష్టాలు