Site icon HashtagU Telugu

India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

Donald Trump, Modi

Donald Trump, Modi

భారత్-అమెరికా (India – US) మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ (Donald Rrump tariffs) తీసుకున్న నిర్ణయాలతో రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన విభేదాలు తలెత్తాయి. ట్రంప్ పరిపాలనలో భారతీయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం, భారత్ కూడా దానికి ప్రతీకారంగా సుంకాలు విధించడం వంటివి ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. ఈ పరిస్థితితో, రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం దెబ్బతిని, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. దీనిపై ఇన్నాళ్లు ప్రధాని మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం వహించారు.

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ, మోడీ ఒక గొప్ప ప్రధానమంత్రి అని, తన స్నేహితుడని పేర్కొన్నారు. గతంలో భారత్‌పై విమర్శలు చేసిన ట్రంప్ నుంచి ఇలాంటి సానుకూల వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. ట్రంప్‌ను అభినందిస్తూ, వారి స్నేహం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి సంకేతాలుగా భావిస్తున్నారు.

ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య ఉన్న వాణిజ్య వివాదాలు త్వరలో పరిష్కారమవుతాయనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వస్తే భారత్‌పై గతంలో విధించిన 25% అదనపు టారిఫ్‌లను ఉపసంహరించుకుంటారని, తద్వారా వాణిజ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని రాజకీయ మరియు వాణిజ్య విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకూ లాభదాయకంగా ఉంటాయని, ఇరు దేశాలు తిరిగి కలిసి పని చేయడానికి మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నారు.

Exit mobile version