Trump Vs Pakistan : అగ్రరాజ్యం అమెరికా కేవలం భారత్‌కే కాదు.. భారత్ శత్రుదేశం పాకిస్తాన్‌కు కూడా ఆయుధాలను అమ్ముతోంది. తనకు ఆయుధాల వ్యాపారమే ముఖ్యమని చాటిచెబుతోంది. ఈవిషయాలను స్వయంగా అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) లెఫ్టినెంట్ జనరల్ (మాజీ) హెచ్ ఆర్ మెక్‌మాస్టర్ వెల్లడించారు. తాజాగా ఆయన రాసిన ‘ఎట్ వార్ విత్ అవర్ సెల్వ్స్: మై టూర్ ఆఫ్ డ్యూటీ ఇన్ ది ట్రంప్స్ వైట్‌హౌస్’ అనే పుస్తకంలో ఈవివరాలను ప్రస్తావించారు. అమెరికా నుంచి పాక్‌కు ఎలా సైనిక సాయం అందుతోందో ఈ బుక్‌లో మెక్‌మాస్టర్(Trump Vs Pakistan) వివరించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘నేను అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న టైంలో నాటి రక్షణ మంత్రి జిమ్ మాటిస్ పాకిస్తాన్‌కు రూ.1200 కోట్ల సైనిక ప్యాకేజీ ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే అప్పటి ట్రంప్ ప్రభుత్వం దీన్ని ఆపేసింది. ఉగ్రవాదానికి పాక్ సాయపడటం ఆపేవరకు ఎటువంటి సాయం ఇవ్వొద్దని అధ్యక్షుడు (ట్రంప్) స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు అఫ్గానీ ప్రజలను, అమెరికన్లను, సంకీర్ణ బలగాలను చంపుతున్నాయని ట్రంప్ గుర్తు చేశారు. పాక్‌కు డబ్బు వెళ్లకూడదని తేల్చి చెప్పారు’’ అని ఆనాడు జరిగిన విషయాలను అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (మాజీ) హెచ్ ఆర్ మెక్‌మాస్టర్ తన పుస్తకంలో ప్రస్తావించారు.
Also Read :UPI Circle : గూగుల్ పే ‘యూపీఐ సర్కిల్’.. ఒకే యూపీఐ ఐడీని ఐదుగురు వాడుకోవచ్చు
‘‘ట్రంప్ ఆదేశాల మేరకు పాకిస్తాన్‌కు సైనిక సహాయక ప్యాకేజీని కేటాయించడాన్ని అమెరికా ఆపేసింది. అయితే ఇతర సాయాలను పాక్‌కు అందించడాన్ని నాటి రక్షణ మంత్రి జిమ్ మాటిస్ కొనసాగించారు’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘జిమ్ మాటిస్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే టైంలోనే లష్కరే తైబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌ను విడుదల చేయడం అమెరికాకు అవమానకరం’’ అని తన పుస్తకంలో మెక్‌మాస్టర్ పేర్కొన్నారు. కొందరు బందీల విషయంలో పాక్ ఐఎస్‌ఐకు, ఉగ్రవాదులకు మధ్య ఉన్న బంధం ఆనాడు జరిగిన పలు పరిణామాలతో బహిర్గతమైందని చెప్పుకొచ్చారు.