Site icon HashtagU Telugu

I Will End War : ఒక్కరోజులో ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపుతా

Donald Trump

I Will End War : “నేను తలుచుకుంటే  ఒకే ఒక రోజులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా” అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

ఒకవేళ తాను రెండోసారి అమెరికా అధ్యక్షుడినైతే..  రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో చర్చలతో ముగిస్తానని  పేర్కొన్నారు.

రష్యా ప్రెసిడెంట్  పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్   జెలెన్స్కీని పిలిచి మాట్లాడి యుద్ధం ఆగిపోయేలా చేస్తానని(I Will End War) తెలిపారు.    

“ఆ యుద్ధాన్ని ఆపడం కష్టమైన పనేం కాదు. నేను కేవలం రెండు కాల్స్ చేయాలనుకుంటున్నాను. ఒకటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి, మరొకటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి. యుద్ధాన్ని ముగించడానికి ఇద్దరికీ ఒకే ఒక ఆప్షన్ ఇస్తాను” అని  డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. “పుతిన్‌తో నాకు చాలా మంచి స్నేహం ఉంది. యుద్ధాన్ని ముగించమని నేను కోరితే అతడు ఒప్పుకుంటాడు” అని అన్నారు.  ఈ కామెంట్స్ ద్వారా ట్రంప్ పరోక్షంగా ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ను టార్గెట్ చేశారు. యుద్ధాన్ని ఆపడానికి బైడెన్ ట్రై చేయడం లేదనేలా ట్రంప్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. 

Also read : 1 Killed : సిమ్లాలోని ఓ రెస్లారెంట్‌లో పేలిన సిలిండర్‌.. ఒకరు మృతి, ప‌ది మందికి గాయాలు

ఇంతకీ ట్రంప్ ప్లాన్ ఏంటంటే..

అమెరికా టీవీ ఛానెల్ ‘ఫాక్స్ న్యూస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్లాన్ ను ట్రంప్ బయటపెట్టాడు. “జెలెన్స్కీ, పుతిన్ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు. యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందం చేసుకోవాలని వాళ్లకు చెబుతాను. యుద్ధం ఆపకుంటే.. ఉక్రెయిన్ కు మేం చాలా సహాయం చేయాల్సి వస్తుందని పుతిన్ కు అల్టిమేటం ఇస్తాను. దీనివల్ల ఇద్దరికీ మార్గం లేకుండా పోతుంది. వారు యుద్ధాన్ని ముగించాల్సి వస్తుంది” అని చెప్పాడు.  “ప్రపంచంలోని మిగిలిన నాయకులు చాలా తెలివైన వారు.. మన అధ్యక్షుడు వారితో అస్సలు వ్యవహరించలేకపోతున్నారనేది నిజం. అమెరికా చరిత్రలో బిడెన్ అత్యంత బలహీనమైన అధ్యక్షుడు అనడంలో సందేహం లేదు” అని ట్రంప్ పేర్కొన్నారు.