Supermarket in Britain: బ్రిటన్‌లో కూరగాయలు, పండ్లకు కటకట

ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతున్న బ్రిటన్‌కు కొత్త కష్టం వచ్చింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో

ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతున్న బ్రిటన్‌కు (Britain) కొత్త కష్టం వచ్చింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఇప్పుడా దేశం తల్లడిల్లుతోంది. నచ్చినదాన్ని కొనుక్కుందామని సూపర్‌ మార్కెట్లకు (Supermarket) వెళ్లే బ్రిటన్‌ వాసులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రపంచంలోని పలు దేశాల్ని కొల్లగొట్టి ధనరాసులతో సంపన్న దేశంగా మారిన బ్రిటన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతోంది. ఆఖరికి కూరగాయలు (Vegetables), పండ్లు (Fruits) కూడా ప్రజలకు అందుబాటులో లేవు. ఒక్కొక్క కస్టమర్‌కు మూడు టమాటాలు (Tomatoes) మాత్రమే అమ్ముతామంటూ బోర్డులు కనిపిస్తుండటంతో అక్కడి ప్రజలు అవాక్కవుతున్నారు. టెస్కో, అస్డా, అల్డి, మోరిసన్ వంటి ప్రముఖ సూపర్‌ మార్కెట్లలో కూరగాయలు (Vegetables), పండ్లను (Fruits) పెట్టే అరమరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటని ఆరా తీస్తే ప్రతికూల వాతావరణం వల్ల పంటల సాగు ఇబ్బందికరంగా మారిందని వెల్లడైంది. గోరుచుట్టుపై రోకటి పోటులా విద్యుత్తు ఛార్జీల ప్రభావం కూడా ఉందని తెలిసింది. ఈ పరిస్థితి మరో మూడువారాల పాటు కొనసాగవచ్చునని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.

మరో ప్రముఖ సూపర్‌ మార్కెట్‌ (Supermarket) మోరిసన్స్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. కస్టమర్లకు ఇక్కడ మరింత నిరాశ ఎదురవుతోంది. టమాటాలు (Tomatoes), కుకుంబర్స్‌ రెండేసి మాత్రమే ఇస్తున్నారు. తోటకూర, పెప్పర్స్‌ ప్యాకెట్లు రెండేసి చొప్పున మాత్రమే అమ్ముతున్నారు. పండ్లు, కూరగాయల కొరత మరికొన్ని సూపర్మార్కెట్లను వేధిస్తున్నప్పటికీ, అమ్మకాలపై పరిమితులను విధించలేదు. చలికాలంలో బ్రిటన్‌కు (Britain) అవసరమైన టమాటాల్లో 95 శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. 90 శాతం తోటకూర కోసం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇవి ఎక్కువగా స్పెయిన్, ఉత్తర ఆఫ్రికాల నుంచి వస్తాయి. అయితే దక్షిణ స్పెయిన్లో చలి తీవ్రత అసాధారణంగా ఉంది. వరదల వల్ల మొరాకోలో పంటల దిగుబడి దెబ్బతింది. తుపానుల వల్ల రవాణా సదుపాయాలు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితులు కొద్ది వారాల్లో సాధారణ స్థితికి చేరుకుంటాయని బ్రిటిష్ రిటెయిల్ కన్సార్షియం చెప్తోంది. బ్రిటన్‌ లో సాగు కాలం ప్రారంభమై.. సూపర్‌ మార్కెట్‌ (Supermarket) లు  ప్రత్యామ్నాయాన్ని అందిపుచ్చుకోగలిగితే.. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్తోంది. ఈ సమస్యలను పరిష్కరించగలిగే నైపుణ్యం సూపర్మార్కెట్లకు ఉందని చెప్తోంది. కస్టమర్లకు తాజా పండ్లు, కూరగాయలు అందుబాటులోకి తీసుకురావడం కోసం రైతులతో కలిసి పని చేయగలవని తెలిపింది.

Also Read:  Foods: రక్తంలో కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ తగ్గాలంటే ఇలాంటి ఆహారం తినాల్సిందే