Site icon HashtagU Telugu

TikTok Ban : టిక్‌టాక్‌పై బ్యాన్ అమల్లోకి.. ఆశలన్నీ ట్రంప్ ఆఫర్‌పైనే

Tiktok Ban in Us

TikTok Ban : సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అమెరికాలో చైనా సోషల్ మీడియా యాప్ ‘టిక్‌టాక్‌’పై నిషేధం ఇవాళ తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో టిక్‌టాక్ యాప్‌లోకి లాగిన్ అయిన అమెరికన్లు అందరూ నిరాశకు గురయ్యారు. ‘‘మేం ప్రస్తుతానికి అందుబాటులో లేము’’ అని ఒక మెసేజ్‌ను టిక్‌టాక్ యాప్ చూపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తమ కార్యకలాపాలను అమెరికాలో తాత్కాలికంగా ఆపివేశామని ఆ సందేశంలో పేర్కొంది.  ‘‘క్షమించండి.. టిక్‌టాక్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టిక్‌టాక్‌ను పునరుద్ధరించడానికి మాతో కలిసి పని చేస్తానని సూచించడం మా అదృష్టం’’ అని టిక్ టాక్(TikTok Ban) సందేశంలో ఉండటం గమనార్హం.

Also Read :Weekly Horoscope : జనవరి 19 నుంచి జనవరి 25 వరకు వారఫలాలు.. ఆ రాశి వారికి అప్పులు తీరుతాయ్

డౌన్‌లోడ్ చేసుకోకుండా..

కొత్తగా ఎవరూ టిక్‌టాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండా.. దాన్ని గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌ల నుంచి డిలీట్ చేశారు. అమెరికాలోని నెటిజన్లకు TikTok యాప్‌ను పంపిణీ చేయకుండా అన్ని మొబైల్ యాప్ స్టోర్‌లు, ఇంటర్నెట్ హోస్టింగ్ సర్వీసులపై ఆంక్షలు విధించే చట్టం ఈరోజు (ఆదివారం) నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికాలో టిక్‌టాక్‌కు 17 కోట్ల మందికిపైగా వినియోగదారులు ఉన్నారు.

Also Read :AP BJP : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. తేల్చబోతున్న అమిత్ షా

ట్రంప్ ఆఫర్ ఇదీ..

నెల రోజుల క్రితం టిక్ టాక్ కంపెనీ సీఈఓతో కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. టిక్ టాక్‌పై బ్యాన్ ఎత్తేయాలని ట్రంప్‌ను టిక్ టాక్ యాజమాన్యం కోరింది. తాము అమెరికా చట్టాల ప్రకారం నడుచుకుంటామని హామీ ఇచ్చారు. అమెరికా యూజర్ల డేటాను అమెరికాలోనే స్టోర్ చేస్తామని చెప్పారు. దీనికి ట్రంప్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో తాను అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత టిక్‌టాక్‌కు 90 రోజుల టైం ఇస్తానని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. టిక్ టాక్ అమెరికా వ్యాపారాన్ని.. అమెరికాలోని కంపెనీకి అమ్మేసే అంశంపై 90 రోజుల్లోగా టిక్ టాక్ తేల్చుకుంటే బెటర్ అని ఆయన అంటున్నారు. ఈ అంశాన్ని టిక్ టాక్ సైతం సీరియస్‌గానే తీసుకుంటోంది. ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ కంపెనీకి తమ వ్యాపారాన్ని అమ్మేయాలని భావిస్తోంది.