Tik Tok Race : అమెరికాలో చైనా సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ వ్యాపారాన్ని కొనేందుకు చాలామందే పోటీపడుతున్నారు. ఈ జాబితాలో ప్రఖ్యాత అమెరికా కంపెనీలు, బిలియనీర్లతో పాటు ఒక విఖ్యాత యూట్యూబర్ కూడా ఉన్నాడు. ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.
Also Read :Most Wanted Criminals : భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టాప్-5 నేరగాళ్లు ఎవరో తెలుసా ?
మిస్టర్ బీస్ట్
టిక్‌టాక్‌ను కొనాలని తనకు చాలా ఆసక్తిగా ఉందని ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్(Tik Tok Race) ప్రకటించారు. టిక్‌టాక్‌కు కొత్త సీఈఓగా అవకాశం లభిస్తే తాను సంతోషిస్తానన్నారు.ఒక ప్రైవేట్ జెట్‌లో కూర్చుని మిస్టర్ బీస్ట్ ఈ కామెంట్స్ చేశారు. మిస్టర్ బీస్ట్ ప్రపంచంలోని టాప్ యూట్యూబర్లలో ఒకరు. ఆయన యూట్యూబ్ ఛానల్‌కు కోట్లాది మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఆయన పోస్ట్ చేసే ఒక్కో వీడియోకు కోట్లాది వ్యూస్ వస్తుంటాయి. మిస్టర్ బీస్ట్ తన కొత్త ఫాలోవర్లలో పలువురిని ఎంపిక చేసి లక్షలాది రూపాయల ప్రైజులు ఇస్తుంటారు.
ఎలాన్ మస్క్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం డొనాల్డ్ ట్రంప్‌కు భారీగా విరాళాలను మస్క్ ఇచ్చారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అమెరికా ప్రభుత్వంలోని గవర్నమెంట్ ఎఫీషియెన్సీ విభాగం (డోజ్) సారథిగా మస్క్ నియమితులు అయ్యారు. ట్రంప్‌కు సన్నిహితుడు కావడంతో మస్క్‌కే టిక్‌టాక్‌ను అమ్మేయాలని చైనా ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే మస్క్ చేతిలో ఎక్స్ (ట్విట్టర్) ఉంది. దానికి టిక్‌టాక్ తోడైతే .. అపర కుబేరుడు మస్క్ సోషల్ మీడియా వ్యాపారం మరింత జోరును అందుకుంటుంది.
Also Read :Vijay : విజయ్ చివరి సినిమా టైటిల్ అనౌన్స్.. తన పొలిటికల్ కెరీర్ కి కరెక్ట్ గా సరిపోయేలా..
టిక్‌టాక్ కోసం ఒరాకిల్..
ఒరాకిల్.. ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఇది మొదటి నుంచీ ట్రంప్ బాగా మద్దతు అందిస్తోంది. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒరాకిల్ చైర్మన్ లారీ ఎలిసన్ ఒకరు. టిక్‌టాక్ కంపెనీ ప్రధాన సర్వర్ ప్రొవైడర్‌లలో ఒరాకిల్ కంపెనీ ఒకటి. బిలియన్ల కొద్దీ టిక్‌టాక్ వీడియోలను స్టోర్ చేసేది ఒరాకిల్ కంపెనీ డేటా సెంటర్‌లోనే. అందుకే తాము సైతం టిక్‌టాక్‌ను కొనేందుకు రెడీ అని ఒరాకిల్ చైర్మన్ లారీ ఎలిసన్ ప్రకటించారు. తమకు సొంత డేటా సెంటర్లు, సర్వర్ల వ్యవస్థలు ఉన్నందున.. టిక్‌టాక్ నిర్వహణ చాలా ఈజీని అని ఆయన వెల్లడించారు. టిక్‌టాక్ పూర్తి బ్యాన్ చేయడం కంటే, తమ లాంటి కంపెనీకి ఇస్తే బెటర్ అని లారీ ఎలిసన్ వాదిస్తున్నారు. టిక్‌టాక్‌పై అమెరికాలో బ్యాన్ పడకుండా ఆపిన వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నారట. ఒకవేళ టిక్‌టాక్ బ్యాన్ అయితే, దాని నుంచి వచ్చే సర్వర్ల నిర్వహణ ఆర్డర్ ఆగిపోతుందని ఒరాకిల్ కంపెనీ పెద్దలకు బాగా తెలుసు.
ఏప్రిల్ మొదటివారంలో తేలుతుంది
టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డాన్స్ చైనా కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది. అమెరికాలోని టిక్ టాక్ వ్యాపారాన్ని ఏదైనా అమెరికా కంపెనీకి అమ్మేయాలని ఓ కోర్టు ఆదేశాలిచ్చింది. దీనికి ఈ ఏడాది జనవరి 19 వరకు గడువు ఇచ్చింది. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాగానే ఇందుకోసం టిక్‌టాక్‌కు 75 రోజుల గడువు ఇస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను విడుదల చేశారు. అంటే ఈ ఏడాది ఏప్రిల్ 10లోగా టిక్‌టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్మేయాలి. దాని 50 శాతం యాజమాన్య హక్కులు అమెరికా కంపెనీకే ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు. దీన్ని ఎవరు కొంటారో వేచిచూడాలి.