Tibet Earthquake : టిబెట్‌లో సంభవించిన భీకర భూకంపం ధాటికి చనిపోయిన వారి సంఖ్య 150 దాటింది. 300 మందికిపైగా ప్రజలు గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. భూకంపంతో ప్రభావితమైన ప్రాంతాల్లో ఇవాళ ఉదయం కూడా సహాయక చర్యలు మొదలయ్యాయి. దాదాపు 30వేల మంది ప్రజలు ఉండటానికి తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేశారు. దీన్నిబట్టి పెద్దసంఖ్యలో భవనాలు, ఇళ్లు కూలిపోయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద తాత్కాలికంగా గుడారాలలో ఆశ్రయం పొందడం అక్కడి ప్రజలకు పెద్ద సవాలే. ఎందుకంటే ప్రస్తుతం టిబెట్‌లో టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. పలుచోట్ల మైనస్ 18 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా చాలామంది భవనాల శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారని తెలిసింది.
Also Read :Assam Coal Mine: తొమ్మిది మంది బొగ్గుగని కార్మికులు బతికేనా ? 2 రోజులుగా 100 అడుగుల లోతున !
భూకంపం(Tibet Earthquake) వల్ల దాదాపు 8 లక్షల జనాభా కలిగిన టిబెట్‌లోని షిగాట్సే ప్రాంతంలో దాదాపు 3,609 ఇళ్లు ధ్వంసమయ్యాయని ప్రాథమిక సర్వేలో తేలింది. గాయపడిన వారికి చికిత్స చేయడానికి 500 మంది వైద్య సిబ్బందికి రంగంలోకి దింపారు. అత్యవసర చికిత్స అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించేందుకు 106 అంబులెన్స్‌లను మోహరించారు. మంగళవారం సాయంత్రానికి పలు టెంట్లు, ఆహార పదార్థాలు, విద్యుత్ జనరేటర్లు సహా అత్యవసర సామగ్రి భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరిందని తెలిసింది.
Also Read :Sundeep Kishan : సందీప్ కిషన్ కి ఆ ఎక్స్ పీరియన్స్ అయ్యిందా..?
టిబెట్ తమదే అని వాదిస్తున్న చైనా.. అక్కడి భూకంప ప్రభావిత ప్రజలకు వేగవంతంగా కనీస సౌకర్యాలను కల్పించలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిబెట్ చైనా ఆధీనంలో ఉండటంతో అక్కడ ఏం జరిగినా వెంటనే ప్రపంచానికి తెలియదు. టిబెట్‌లో మీడియా కవరేజీపై ఆంక్షలు ఉంటాయి. మంగళవారం రోజు టిబెట్‌లో సంభవించిన భూకంప కేంద్రం చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న టింగ్రిలో ఉందని గుర్తించారు. దీని ఎఫెక్టుతో నేపాల్, భూటాన్, భారత్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. టిబెట్‌లోని సిచువాన్‌లో 2008లో 8.0 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 70వేల మంది చనిపోయారు.