Trump Vs Zelensky: రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు మొండిచెయ్యి ఇచ్చే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా ఇకపై నిర్ణయాలు తీసుకోలేమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. యుద్ధం వద్దని, ఇకనైనా రష్యాతో శాంతి చర్చలు జరపాలని ఉక్రెయిన్‌కు ట్రంప్ సూచించారు. నేరుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఈ సూచన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లతో జెలెన్ స్కీకి వాడీవేడి చర్చ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ప్రపంచ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read :Location Tracking Device: గూడ్స్, ప్యాసింజర్ వాహనాల్లో ఇక ఆ డివైజ్ తప్పనిసరి !
ఉక్రెయిన్‌కు ఆప్షన్లు లేవు : ట్రంప్
‘‘మీరు యుద్ధాన్ని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్ ప్రజలను ఇబ్బందిపెడుతున్నారు’’ అని జెలెన్ స్కీని ఉద్దేశించి ట్రంప్ కామెంట్ చేశారు. రష్యాతో యుద్ధాన్ని కొనసాగించాలనే ఏకైక లక్ష్యంతో.. ఉక్రెయిన్‌కు చెందిన ఖనిజ వనరులను అమెరికా ప్రభుత్వ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికి జెలెన్ స్కీ సిద్ధపడ్డారు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు వైట్ హౌస్‌లో ట్రంప్(Trump Vs Zelensky), జేడీ వాన్స్, జెలెన్ స్కీ భేటీ అయ్యారు. అయితే అనుకోకుండా ఈ కార్యక్రమంలో మాటలు పెరిగిపోయి, వాగ్వాదం జరిగింది. దీంతో ట్రంప్ కోపగించుకొని.. ‘‘మీ దేశం (ఉక్రెయిన్) దగ్గర ఇప్పుడు అవకాశాలు కానీ, ఆప్షన్లు కానీ లేవు. అందుకే అతి పనికిరాదు. ఇప్పుడు మీ దగ్గర సరిపడా సైనికులు కూడా లేరు. ఇక యుద్ధం ఎందుకు ?’’ అని హితవు పలికారు.
Also Read :Top 5 Predictions 2025: ఈ ఏడాది జరగబోయే ఐదు విపత్తులివే.. టైం ట్రావెలర్ జోస్యం
మీకు మేమే దిక్కు : ట్రంప్
”యుద్ధం ప్రారంభం నుంచి మేం ఒంటరిగా పోరాడుతున్నాం. దానికి మేం కృతజ్ఞులమై ఉంటాం” అని జెలెన్ స్కీ చెప్పారు. దీంతో మండిపోయిన ట్రంప్.. ‘‘స్టుపిడ్ ప్రెసిడెంట్ జో బైడెన్ పాలనా కాలంలో మీకు దాదాపు రూ.30,61,469 కోట్లు ఇచ్చాం. అందువల్లే ఇప్పటిదాకా యుద్ధం నడిచింది. మేం లేనిది మీరు యుద్ధమే చేయలేరు’’ అని చురకలు అంటించారు. దీంతో సంభాషణ మధ్యలోనే అక్కడి నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెళ్లిపోయారు. అనంతరం మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘రష్యాతో శాంతిని కోరుకున్నప్పుడే మళ్లీ జెలెన్ స్కీ వైట్‌హౌస్‌కు రావాలి’’ అని పేర్కొన్నారు.