Assassination Attempt : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన అడుగడుగునా ముప్పును ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయనపై రెండుసార్లు హత్యయత్నాలు జరిగాయి. తాజాగా కాలిఫోర్నియాలోని కోచెల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఓ దుండగుడు ట్రంప్‌ను హత్య చేసేందుకు యత్నించాడు. సదరు దుండగుడు నకిలీ ప్రెస్‌కార్డు, ఎంట్రీ పాస్‌లతో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సభ వద్దకు చేరుకున్నాడు. స్టేజీ సమీపంలో లోడ్ చేసిన షాట్‌గన్, హ్యాండ్‌గన్, హై కెపాసిటీ కలిగిన మ్యాగజైన్‌తో తిరగడం ఆరంభించాడు.
Also Read :Hezbollah Attack : నలుగురు ఇజ్రాయెలీ సైనికులు మృతి.. 58 మందికి గాయాలు.. సూసైడ్ డ్రోన్లతో హిజ్బుల్లా దాడి
అతడిని వెంటనే గుర్తించిన అమెరికా సీక్రెట్ సర్వీసెస్(Assassination Attempt) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని ప్రశ్నించగా.. తాను లాస్‌వెగాస్ వాసినని, పేరు వేం మిల్లర్(49) అని చెప్పాడు. అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక మితవాద సంస్థలో తాను సభ్యుడిగా ఉన్నానని తెలిపాడు. అయినా ట్రంప్‌నకు మద్దతుదారుడినే అని మిల్లర్ పేర్కొన్నాడు. 2022లో వ్యక్తిగత రక్షణ కోసం తుపాకులను కొన్నట్లు వెల్లడించాడు. ఆ ఆయుధాలతో బట్లర్ ప్రాంతం మీదుగా వెళ్తుండగా పోలీసులు తన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని వేం మిల్లర్ చెప్పాడు.
Also Read :KTR : కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా.. నేడు కోర్టులో విచారణ
ట్రంప్ ప్రచార సభ వద్దకు ఆ సాయుధుడు తీసుకొచ్చిన కారుకు రిజిస్ట్రేషన్ నంబరు కూడా లేదు. అందులో మందుగుండు సామగ్రి, తుపాకులు, నకిలీ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా దొరికాయి. దీంతో హత్య అనంతరం విదేశాలకు పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు భావిస్తున్నారు. వేం మిల్లర్‌కు శనివారమే (అక్టోబరు 12న) కోర్టు బెయిల్‌ను మంజూరు చేసిందని గుర్తించింది. బెయిలుపై జైలు నుంచి విడుదలైన వెంటనే అతడు ట్రంప్ హత్యకు యత్నించడం గమనార్హం. ట్రంప్ హత్య కోసం సదరు దుండగుడికి సుపారీ ఇచ్చింది ఎవరు ? అనేది తెలుసుకోవడంపై అమెరికా సీక్రెట్ సర్వీసు ఫోకస్ పెట్టింది.