Site icon HashtagU Telugu

Lion: సింహాన్ని గిరగిరా తిప్పేసిన మహిళ.. షాకింగ్ వీడియో వైరల్!

99 0

99 0

Lion: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులోనూ ఈ మధ్యకాలంలో జంతువులకు సంబంధించిన వీడియో ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ క్రూర మృగం గురించి ఓ వీడియో వైరల్ అవుతోంది. సింహాన్ని అడవికి రారాజుగా పిలుస్తారు. అటువంటి సింహం కంట ఎవరైనా పడితే ఇక దానికి ఆహారం అవ్వాల్సిందే.

సింహం ఎవరినైనా చూస్తే తినకుండా ఉండదు. దానిని నుంచి తప్పించుకుని బతికి బట్టకట్టడం దాదాపుగా అసాధ్యం అని అందరికీ తెలుసు. అలాంటి క్రూర మృగాన్ని ఓ మహిళ ఏకంగా ఎత్తుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను యానిమల్స్‌ పవర్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో ఇది కాస్తా వైరల్ అవుతోంది.

వీడియోలో ఓ మహిళ సింహాన్ని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని వీధిలో మోసుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆ టైంలో సింహం, మహిళ చేతుల్లో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం చేసినట్లు మనం చూడోచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది చూసిన నెటిజన్లు ‘షాకింగ్‌’, ‘వండర్‌ వుమెన్‌’ అంటూ ఆ మహిళను పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.

సాధారణంగా ఎవరైనా సింహాన్ని చూస్తే భయపడతారు. అందులోనూ మహిళలు ఎక్కువగా ఇటువంటి జంతువులకు ఇంకాస్త ఎక్కువగా భయపడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆ సింహమే ఆ మహిళకు భయపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.