US Seal Vs Laden: ఒసామా బిన్ లాడెన్.. కరుడుగట్టిన ఉగ్రవాది. అతగాడు 2011 సంవత్సరం మే 2న పాకిస్తాన్‌లోని అబోటాబాద్ మిలిటరీ కంటోన్మెంట్ శివారులో హతమయ్యాడు. అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అక్కడ దాక్కున్నాడని తెలియగానే.. అమెరికా అలర్ట్ అయింది. అతడిని మట్టుబెట్టేందుకు ‘ఆపరేషన్ నెప్యూన్‌స్పియర్’ను మొదలుపెట్టింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. పాకిస్తాన్ రాడార్ సిగ్నళ్లను తప్పించుకొని రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లలో 79 మంది అమెరికా నేవీ సీల్ కమాండోలు అబోటాబాద్ మిలిటరీ కంటోన్మెంట్ శివారుకు చేరుకున్నారు. అక్కడున్న ఒక ఇంటి పైగదిలో దాక్కున్న లాడెన్‌ను వారు చంపారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం అతడి మృతదేహాన్ని సముద్రంలో పారవేశారు. ఆనాడు లాడెన్‌ను కాల్చిచంపిన అమెరికా నేవీసీల్ కమాండో రాబర్ట్ ఓనీల్ గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎందుకు ?
Also Read :Kashi Temple : ప్రయాగ్‌రాజ్ టు కాశీ.. విశ్వనాథుడి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ
గంజాయి వ్యాపారం
లాడెన్‌ను చంపిన అమెరికా నేవీసీల్(US Seal Vs Laden) కమాండో రాబర్ట్ ఓనీల్ వయసు ప్రస్తుతం 48 ఏళ్లు. అతగాడు ఇప్పుడు గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అమెరికా మెట్రో నగరం న్యూయార్క్‌లో ప్రభుత్వ లైసెన్స్‌తో ఈ దందాను నడుపుతున్నాడు. సమాజసేవ కోసమే గంజాయి బిజినెస్ చేస్తున్నట్లు రాబర్ట్ ఓనీల్ తెలిపాడు. ‘ఆపరేటర్ కన్నా కో’ పేరిట తన గంజాయి బ్రాండ్ ఉత్పత్తులను అమ్ముతున్నాడు.
Also Read :Watermelon Rind : పుచ్చకాయ తొక్క.. పురుషులకు షాకింగ్ బెనిఫిట్
ఎందుకీ బిజినెస్ ?
అమెరికా సైన్యంలో పనిచేసిన వాళ్లు తీవ్రమైన ‘పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్’తో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లకు గంజాయి లాంటి డ్రగ్స్‌ను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక దుకాణాలను నిర్వహిస్తుంటుంది. ఆయా దుకాణాల నిర్వహణ బాధ్యతను మాజీ సైనికులకు అప్పగిస్తుంటుంది. ఈక్రమంలోనే న్యూయార్క్ నగరంలో ఉన్న గంజాయి విక్రయ కేంద్రం నిర్వహణ లైసెన్సును రాబర్ట్ ఓనీల్‌కు మంజూరు చేశారు. కేవలం అమెరికా మాజీ సైనికులకు మాత్రమే ఇక్కడ గంజాయిని విక్రయిస్తారు. ప్రతీ విక్రయంపై అమెరికా ప్రభుత్వం ఆకర్షణీయమైన కమీషన్‌ను రాబర్ట్ ఓనీల్‌కు అందిస్తుంది. ఈ వ్యాపారంలో వచ్చే లాభాలను వికలాంగులైన మాజీ సైనికుల కోసం నడుస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్‌కు దానం చేస్తానని అతడు ప్రకటించాడు.