Pakistani Beggars : పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దారుణ స్థితిలో ఉంది. అక్కడ పేదరికం క్రమంగా పెరుగుతోంది. మధ్యతరగతి ప్రజలు కూడా పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నాయి. కానీ ప్రజల వేతనాలు, ఆదాయాలు పెరగడం లేదు. పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వం చేష్టల వల్లే అక్కడి ప్రజలకు ఈ దుస్థితి వచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ జనాభా 26 కోట్ల దాకా ఉంటుంది. అయితే ఆ దేశంలో బిచ్చగాళ్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ? 2.2 కోట్ల మంది బిచ్చగాళ్లు పాక్‌లో ఉన్నారట. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా పాక్‌లో ఇంకా ఎక్కువ మందే బిచ్చగాళ్లు ఉంటారని అంచనా. మొత్తం మీద పాకిస్తాన్ దేశ జనాభాలో దాదాపు 9 శాతం మంది దాకా బెగ్గర్స్ ఉన్నారు. పాక్‌లోని 2.2 కోట్ల మంది బెగ్గర్స్ అడుక్కుతినడం ద్వారా ఏటా దాదాపు రూ.1000 కోట్ల దాకా సంపాదిస్తారట.
Also Read :EOS 09 Mission : ఈఓఎస్-09 ఉపగ్రహ ప్రయోగం ఫెయిల్.. కారణమిదీ
సౌదీ వార్నింగ్.. మారని పాక్
ఈ బెగ్గర్స్ పాకిస్తాన్ వీధుల్లోనే కాదు.. విదేశాల్లోనూ పాక్(Pakistani Beggars) పరువు తీస్తున్నారు. ప్రత్యేకించి పాకిస్తాన్ మిత్రదేశం సౌదీ అరేబియాలో పెద్దసంఖ్యలో పాక్ బెగ్గర్లు ఉన్నారు. రియాల్స్ రూపంలో ఇంకా ఎక్కువ ముష్టిని సంపాదించొచ్చనే అత్యాశతో పాక్ బిచ్చగాళ్లు సౌదీకి చేరుతున్నారు. హజ్, ఉమ్రా యాత్రలు, విజిటింగ్ వీసాలు, టూరిస్ట్ వీసా ద్వారా సౌదీలోకి అడుగుపెట్టి.. ఇక అక్కడే అడుక్కుతింటూ సెటిలై పోతున్నారు. ఈవిషయాన్ని సౌదీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. టూరిస్టుల ముసుగులో బిచ్చగాళ్లను తమ దేశానికి పంపొద్దని గతంలో చాలాసార్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి సౌదీ వార్నింగ్ ఇచ్చింది. తగిన బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవాళ్లనే సౌదీ యాత్రల కోసం పంపాలని షాబాజ్ షరీఫ్ సర్కారుకు హితవు పలికింది.
Also Read :Nara Lokesh : సరైన టైములో లోకేష్ ను రంగంలోకి దింపబోతున్న టీడీపీ ..?
పాక్‌లోని ఈ రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో బెగ్గర్స్
ఇక తాము పాక్ బిచ్చగాళ్లను భరించేది లేదని సౌదీ రాయల్ ఫ్యామిలీ కుండబద్దలు కొట్టింది. ఇటీవలే ఏకంగా 5వేల మంది పాక్ బిచ్చగాళ్లను ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌కు సౌదీ సర్కారు సాగనంపింది. వాళ్లందరూ భవిష్యత్తులో సౌదీలోకి అడుగు పెట్టకుండా బ్లాక్ లిస్టులో చేర్చింది. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు ఇరాక్, మలేసియా, ఒమన్, ఖతర్, యూఏఈ దేశాలు కూడా పెద్దసంఖ్యలోనే పాక్ బిచ్చగాళ్లను తరిమేశాయి. ఈ బిచ్చగాళ్లలో ఎక్కువ మంది పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ వాళ్లే ఉండటం గమనార్హం. ప్రావిన్స్ అంటే రాష్ట్రం అని అర్థం.