చైనా బ్రహ్మపుత్ర నది(Brahmaputra River)కి సంబంధించిన భవిష్యత్తు మరో కీలక నిర్ణయం తీసుకుంది. టిబెట్(Tibet)లోని న్యింగ్‌చి ప్రాంతంలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు(China Mega-Dam )ను నిర్మించడం ప్రారంభించింది. ఈ డ్యామ్ నిర్మాణానికి చైనా ప్రధాన మంత్రి లి కియాంగ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐదు భారీ జలవిద్యుత్ కేంద్రాలను కూడా నిర్మించనున్నారు. ప్రాజెక్టు ఖర్చు అంచనా రూ.14.4 లక్షల కోట్లకు చేరుతుందని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ప్రకటించింది.
ఈ డ్యామ్ వల్ల చైనాకు విద్యుత్ ఉత్పత్తిలో ప్రగతి సాధించగలగడం సత్యమే అయినప్పటికీ, దీని కారణంగా దిగువనున్న భారత్, బంగ్లాదేశ్ దేశాలకు నీటి ప్రవాహంలో అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిని (చైనాలో యార్లుంగ్ త్సాంగ్‌పోగా పిలుస్తారు) హిమాలయాల్లో ఎక్కువ నీరు నిల్వ చేసే లక్ష్యంతో డ్యామ్ నిర్మించడం వల్ల, సమయానికి నీరు విడుదల చేయకపోతే దక్షిణ దిశలో ఉన్న ప్రాంతాలు దెబ్బతిన్న అవకాశముంది. అదనంగా ఒకేసారి ఎక్కువ నీటిని విడుదల చేస్తే భారీ వరదలు వచ్చే అవకాశమూ ఉంది.
AP Liquor Case : ఛార్జ్ షీట్ లో జగన్ పేరు..ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చా..?
గతంలో భారత్ ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి జైశంకర్ డిమాండ్ మేరకు, చైనా దిగువన ఉన్న దేశాల ప్రయోజనాలను దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అయితే చైనా తమ నిర్మాణం వల్ల భారత్‌కు ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పినప్పటికీ, భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అసోం తదితర రాష్ట్రాలపై దీని ప్రభావం పడే అవకాశాన్ని పక్కన పెట్టలేం. నీటి ప్రవాహం నియంత్రణకు చైనా కట్టే డ్యామ్, అప్రతిబంధిత వరదలకు కారణమవుతుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఇక పర్యావరణ పరంగా కూడా ఈ ప్రాజెక్టుపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిమాలయాల్లో భారీ నిర్మాణాలు పెరగడం వల్ల అక్కడి భూకంపప్రాంతాలు మరింత అస్థిరంగా మారే ప్రమాదం ఉంది. బ్రహ్మపుత్ర నది పరివాహక రాష్ట్రాలు ఇప్పటికే క్షీణిస్తున్న వాతావరణ పరిస్థితులనేం ఎదుర్కొంటున్న తరుణంలో, చైనా మెగా డ్యామ్ ఇది మరింత సంక్షోభానికి దారి తీయవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో బ్రహ్మపుత్రపై చైనా నిర్మాణం అంతర్జాతీయంగా కూడా చర్చకు తెరతీసిన అంశంగా మారుతోంది.
Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు హ్యాండిచ్చిన బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియా?!