King And Queen : రాజు, రాణి కలిసి రథంపై ఊరేగుతారని మనం విన్నాం. అయితే ఒక రాజు, రాణి కలిసి ఏకంగా విమానంలో ప్రయాణించారు. అసలు విషయం ఏమిటంటే.. స్వయంగా రాజే ఆ విమానాన్ని నడిపాడు. కో పైలట్‌గా రాణి వ్యవహరించారు. ఇద్దరూ హ్యాపీగా కూర్చొని.. తాపీగా ముచ్చట్లు పెడుతూ విమాన ప్రయాణం చేశారు. థాయ్‌లాండ్ నుంచి బయలుదేరి భూటాన్‌కు చేరుకున్నారు.
Also Read :Robo Police : ‘రెడ్ బటన్’ రోబో పోలీసులు వస్తున్నారహో !!
మహా వజ్రలాంగ్‌కోర్న్.. వారెవా
వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్, రాణి సుతీదాలు(King And Queen) ఇటీవలే భూటాన్‌లో పర్యటించారు. వారు ప్రత్యేక విమానంలో థాయ్‌లాండ్ నుంచి భూటాన్‌కు చేరుకున్నారు. రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్ ఆ విమానాన్ని నడిపారు. కో పైలట్ బాధ్యతలను రాణి సుతీదాలు సమర్ధంగా నిర్వర్తించారు. ప్రపంచంలోనే అత్యంత సవాళ్లతో కూడిన ఎయిర్‌పోర్టు భూటాన్‌లోని పారో చూ లోయలో ఉంది. దీన్ని పారో ఎయిర్ పోర్టు అని పిలుస్తారు. అంత క్లిష్టతరమైన పారో ఎయిర్‌పోర్టులో తన విమానాన్ని థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్ అవలీలగా ల్యాండ్ చేయించారు. దీనికి సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు అంతర్జాతీయ మీడియాలో వైరల్ అయ్యాయి. విమానయాన రంగంలో ఎంతో నిపుణులైన పైలట్లు మాత్రమే పారో ఎయిర్‌పోర్టులో విమానాలను సేఫ్ ల్యాండింగ్ చేయించగలరు. అలాంటి పనిని థాయ్‌లాండ్ రాజు ఈజీగా చేయడంపై సర్వత్రా సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read :Pegasus Spyware : ఇజ్రాయెలీ ‘పెగాసస్’ స్పైవేర్ కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
థాయ్‌లాండ్ రాజు వెరీ స్పెషల్
థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్‌కు విమానం నడిపే స్కిల్స్ ఎక్కడివి ? అంటే.. ఆయన కెరీర్ రాయల్ థాయ్ ఆర్మీలో సాధారణ ఆఫీసర్‌గా మొదలైంది. ఎఫ్-5, ఎఫ్-16, బోయింగ్ 737-400 లాంటి విమానాలను నడపడం ఆయన నేర్చుకున్నారు. 2016 సంవత్సరం నుంచి థాయ్‌లాండ్ రాజుగా మహా వజ్రలాంగ్‌కోర్న్ వ్యవహరిస్తున్నారు. ఆయన 1952 జులై 28న జన్మించారు. 1972 సంవత్సరంలో 20 ఏళ్ల వయసులో మహా వజ్రలాంగ్‌కోర్న్‌ను యువరాజుగా నియమించారు. తండ్రి చనిపోయాక 2016 డిసెంబరు 1 నుంచే ఆయన థాయ్‌లాండ్ రాజుగా వ్యవహరిస్తున్నారు. అయితే అధికారికంగా పట్టాభిషేకం మాత్రం 2019 మేనెల మొదటివారంలో జరిగింది.