Talibans New Diktat : ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు తమదైన స్టైల్‌లో అరాచక పాలనను నడిపిస్తున్నారు. వింత వింత ఆదేశాలు.. రాక్షస ఆర్డర్స్ ఇస్తూ దేశ ప్రజలను రాచిరంపాన పెడుతున్నారు. ప్రత్యేకించి మహిళలను వేధించే, ఇబ్బందిపెట్టే ఆర్డర్సే ఎక్కువగా జారీ చేస్తున్నారు. తాజాగా అలాంటిదే ఒక పిచ్చి ఆర్డర్‌ను తాలిబన్ల ప్రభుత్వం ఇచ్చింది.
Also Read :Vijay Vs DMK : “ప్రియమైన సోదరీమణులారా..” టీవీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్ ఎమోషనల్ లేఖ
తాలిబన్లు జారీ చేసిన కొత్త ఆర్డర్ అనేది ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్తగా నిర్మించే ఇళ్లకు సంబంధించినది. కొత్తగా కట్టే ఇళ్లల్లో నుంచి మహిళలు బయటివారికి కనిపించకుండా ఏర్పాట్లు ఉండాలని తాలిబన్లు ఆదేశించారు. ప్రత్యేకించి కొత్త ఇళ్లలో వంటగదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దన్నారు. ఒకవేళ వంట గదిలో కిటికీలు ఉంటే.. దాని నుంచి మహిళలు బయటికి కనిపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇంటి ఆవరణ చుట్టూ సాధ్యమైనంత ఎక్కువ ఎత్తులో ఫెన్సింగ్ ఉండేలా చూడాలని తాలిబన్లు కోరారు. దీనివల్ల ఇంటి ఆవరణలో మహిళలు తిరిగినా.. బయటికి కనిపించరని తెలిపారు. మహిళలు తాగునీటిని బిందెలలో తీసుకెళ్లేందుకు బావుల వద్దకు వచ్చినప్పుడు.. ఇతరులకు కనిపించే అవకాశం ఉందని తాలిబన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు నీళ్లు తీసుకెళ్లే చేతి పంపులు, బావుల ఏరియాలలోనూ ఫెన్సింగులు ఏర్పాటు చేయాలని తాలిబన్లు నిర్దేశించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఒక పోస్టు పెట్టారు. ఈమేరకు డిజైనింగ్ ఉన్న కొత్త నిర్మాణ ప్రతిపాదనలకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని దేశ మున్సిపల్ అధికారులను తాలిబన్లు(Talibans New Diktat) ఆదేశించారు.
Also Read :Pushpa 2 Collections : ‘పుష్ప 2 ది రూల్’ 25వ రోజు ఎన్ని కలెక్షన్స్ సాధించిందంటే..
ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లోని జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై బ్యాన్ అమల్లో ఉంది. బాలికలను మిడిల్ స్కూల్, హైస్కూల్ విద్యకు కూడా తాలిబన్లు దూరం చేశారు. పలు రంగాల్లో మహిళలు జాబ్ చేయడంపైనా బ్యాన్ విధించారు. మహిళలు ఆటలాడటంపై నిషేధాన్ని అమలు చేస్తున్నారు.