Site icon HashtagU Telugu

Taiwan – China : స్వరం మార్చిన తైవాన్ కొత్త ప్రెసిడెంట్.. చైనాకు స్నేహ హస్తం

Taiwan China

Taiwan China

Taiwan – China :  తైవాన్‌ కొత్త అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌-తె స్వరం మార్చారు. కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు చైనాపై నోరుపారేసుకున్న ఆయన.. ఇప్పుడు వెనక్కి తగ్గారు. తన దూకుడును తగ్గించి.. చైనాతో చేతులు కలిపేందుకు రెడీ అయ్యారు. ‘‘చైనాతో కలిసి పనిచేయడానికి నేను రెడీ. ఆ దేశంతో సమన్వయం సాధించి ముందుకు సాగుతాను’’ అని ఆయన ప్రకటించారు. ‘‘ప్రాంతీయ స్థిరత్వం సాధించడం అత్యవసరం. తైవాన్‌ జలసంధిలో అలజడులను ఆపడమే నా లక్ష్యం. అందుకోసం చైనాతో కలిసి నడుస్తాను.పరస్పర అంగీకారంతో ముందుకు సాగుదాం. చైనా, తైవాన్ కలిసి నడిస్తే ప్రాంతీయంగా శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. ఈవిషయంలో అంతర్జాతీయ సహకారాన్ని కూడా తీసుకుంటాం’’ అని తైవాన్‌ కొత్త అధ్యక్షుడు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

ఇటీవల తైవాన్‌లో(Taiwan – China) జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకిగా పేరొందిన లాయ్‌ చింగ్‌-తె విజయం సాధించారు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం సందర్భంగా తమను బెదిరించడం ఆపాలంటూ డ్రాగన్‌కు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన చైనా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది.  తైవాన్‌ ద్వీపం చుట్టూ రెండు రోజుల పాటు భారీ ఎత్తున సైనిక విన్యాసాలను చేపట్టింది. ఇందుకోసం పెద్దసంఖ్యలో యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక హెలికాప్టర్లను వినియోగించింది. ఒకానొక దశలో తైవాన్ బార్డర్‌‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు కూడా చైనా ఆర్మీకి చెందిన ఒక నౌకాదశల యూనిట్ ప్రయత్నాలు చేసిందనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇటీవల అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తైవాన్ కొత్త అధ్యక్షుడు మెత్తబడ్డారు.  చైనాతో మెతక వైఖరితో వ్యవహరించాలని ఆయన డిసైడ్ అయ్యాడు. అందుకే చైనాతో కలిసి నడుస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటామని ప్రకటించారు.

Also Read :MLC By Elections : రూ.30 కోట్లతో ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ కుట్ర.. ఈసీకి రఘునందన్ కంప్లయింట్