Sweden Shooting: ఒక తీర్పు.. ఒక మర్డర్.. స్వీడన్‌లో కాల్పులు.. 10 మంది మృతి

దీనిపై స్పందించిన స్వీడన్(Sweden Shooting) ప్రధానమంత్రి ఉల్ఫ్‌ క్రిస్టర్సన్‌.. ఇది స్వీడన్‌కు ఎంతో బాధాకరమైన రోజు అని తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Sweden School Shooting Orebro

Sweden Shooting: ఐరోపా దేశం స్వీడన్‌‌లోని  ఒరెబ్రో నగరంలో కాల్పుల మోత మోగింది. ఒక కాలేజీ (రిస్‌బెర్గ్‌స్కా స్కూల్‌)లో దుండగుడు విచక్షణారహితంగా జరిపిన  కాల్పుల్లో దాదాపు 10 మంది చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స జరుగుతోంది. కాల్పులు జరిపిన దుండగుడు కూడా చనిపోయాడు. అతడిని పోలీసులు మట్టుబెట్టారని కొందరు చెబుతుంటే..  దుండగుడు తనకు తాను కాల్చుకున్నాడని మరికొందరు అంటున్నారు.

Also Read :Liquor Scam : భారీ లిక్కర్ స్కాం.. మద్యం ముడుపులకు హవాలా నెట్‌వర్క్‌.. సంచలన కథనం

దాడి జరిగిన వెంటనే కాలేజీ క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులను పక్కనున్న భవనాల్లోకి తరలించారు.  దీనిపై స్పందించిన స్వీడన్(Sweden Shooting) ప్రధానమంత్రి ఉల్ఫ్‌ క్రిస్టర్సన్‌.. ఇది స్వీడన్‌కు ఎంతో బాధాకరమైన రోజు అని తెలిపారు. మొత్తం మీద స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌కు 200 కి.మీ దూరంలోని ఒరెబ్రో నగరం కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాడి ఘటన జరిగిన పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. రిస్‌బెర్గ్‌స్కా స్కూల్‌‌లో ప్రాథమిక, అప్పర్‌ ప్రైమరీ, వలసదారులకు, మానసిక దివ్యాంగులకు విద్యాబోధన జరుగుతుంటుంది. ఇది ఉగ్రదాడి అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read :Sandeep Vanga : సందీప్ వంగాతో చిరంజీవి సినిమా పడితే..!

ఒక తీర్పు.. ఒక మర్డర్.. ఆ వెంటనే..

ఫిబ్రవరి 3వ తేదీన స్వీడన్ రాజధానిలోని స్టాక్‌‌హోం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2023 సంవత్సరంలో ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రతులను దహనం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తిని దోషిగా తేల్చింది.  ఖురాన్ ప్రతులను దహనం చేసే కార్యక్రమంలో దోషిగా తేలిన వ్యక్తికి సహాయం చేసిన సల్వాన్ మోమికా అనే వ్యక్తి  జనవరి 29న స్వీడన్‌లోని సోదెర్‌తాల్జేలో దారుణంగా హత్యకు గురయ్యాడు. తొలుత  సల్వాన్ మోమికా మర్డర్, తదుపరిగా ఈ కేసులోని నిందితుడిగా దోషిగా ప్రకటించడం జరిగాయి. సల్వాన్ మోమికా ఇరాక్‌కు చెందిన క్రైస్తవుడు. ఆ వెంటనే తాజాగా స్వీడన్‌లో కాలేజీలో కాల్పులు జరగడం గమనార్హం.

Also Read :PM Modi To Kumbh: నేడు మ‌హా కుంభ‌మేళాకు ప్ర‌ధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!

  Last Updated: 05 Feb 2025, 08:10 AM IST