Earthquake: దెబ్బ మీద దెబ్బ.. న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

గత కొన్ని రోజులుగా గాబ్రియెల్ తుఫానుతో న్యూజిలాండ్ (New Zealand) గజగజ వణుకుతుండగా.. ఇప్పుడు భూకంపం (Earthquake) వచ్చి పడింది.

Published By: HashtagU Telugu Desk
Philippines

Earthquake 1 1120576 1655962963

పశ్చిమాసియా దేశాలైన టర్కీ, సిరియాలో సంభవించిన విధ్వంసకర భూకంపాల తర్వాత.. ఇప్పుడు ఆస్ట్రేలియా ఖండానికి దక్షిణాన ఉన్న న్యూజిలాండ్ దేశాన్ని కూడా భూకంపం వణికించింది. బుధవారం (ఫిబ్రవరి 15) మధ్యాహ్నం న్యూజిలాండ్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌లోని లోయర్ హట్‌కు వాయువ్యంగా 78 కిలోమీటర్ల దూరంలో భూకంప ప్రకంపనలు వచ్చినట్లు భూకంప నివేదికల ఏజెన్సీ EMSC తెలిపింది. ఇక్కడ రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం నమోదైంది.

గత కొన్ని రోజులుగా గాబ్రియెల్ తుఫానుతో న్యూజిలాండ్ (New Zealand) గజగజ వణుకుతుండగా.. ఇప్పుడు భూకంపం (Earthquake) వచ్చి పడింది. బుధవారం వెల్లింగ్‌టన్‌లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పరపరము పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో.. 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపారు. భూకంపం ధాటికి వెల్లింగ్‌టన్‌లో కొన్ని సెకన్లపాటు బలమైన కదలికలు సంభవించినట్లు పేర్కొన్నారు.

Also Read: Leopard: కొడుకు కోసం చిరుతతో తల్లి పోరాటం.. ఎక్కడంటే..?

న్యూజిలాండ్‌లో వారం రోజులుగా గాబ్రియెల్ తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ తుపాను కారణంగా పలు నగరాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించేంతగా పరిస్థితి విషమించింది. ఇక్కడ 6 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు.
తుఫాను కారణంగా, న్యూజిలాండ్‌లో అలలు ఎగసిపడుతున్నాయి. భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీని వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. అదే సమయంలో వరదల కారణంగా పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. న్యూజిలాండ్ ప్రభుత్వ పత్రికా ప్రకటన ప్రకారం మంగళవారం (ఫిబ్రవరి 14) జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇది ఇప్పటికే స్థానిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఆరు ప్రాంతాలకు వర్తిస్తుంది. ఈ ప్రాంతాలలో న్యూజిలాండ్, నార్త్‌ల్యాండ్, ఆక్లాండ్, తైరావిటి, బే ఆఫ్ ప్లెంటీ, వైకాటో, హాక్స్ బే ఉన్నాయి.

  Last Updated: 15 Feb 2023, 01:54 PM IST