Space To Sea : మన ‘గగన్‌యాన్‌’ జరగబోయేది ఇలాగే.. వీడియో చూడండి

Space To Sea : దివి నుంచి భువికి దిగిరావడం అంటే ఇదే !! 

  • Written By:
  • Updated On - March 12, 2024 / 05:49 PM IST

Space To Sea : దివి నుంచి భువికి దిగిరావడం అంటే ఇదే !!  మన దేశం త్వరలో చేయబోతున్న గగన్ యాన్‌కు నమూనా ఇదే!!  వీడియో చూస్తే చాలు.. మీకు మొత్తం సీన్ అర్ధమైపోతుంది !! అమెరికా (జాస్మిన్‌ మాగ్‌బెలి), ఐరోపా (ఆండ్రీస్‌ మోగెన్‌సెన్‌), జపాన్ (సతోషి ఫురుకవా), రష్యా(కొన్‌స్తాంటిన్‌ బొరిసోవ్‌) దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములు గతేడాది ఆగస్టు 26న అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నడీ స్పేస్‌సెంటర్‌ నుంచి స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లారు. వాళ్లంతా కలిసి దాదాపు 200 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో రీసెర్చ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

నలుగురు వ్యోమగాములు స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌‌లో కూర్చొని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సముద్రం వైపుగా(Space To Sea) బయలుదేరారు. చివరకు పారచూట్ల సాయంతో.. స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌‌ ఫ్లోరిడా తీరం సమీపంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో సముద్ర జలాల్లో సురక్షితంగా  ల్యాండ్ అయింది.  ఆ వెంటనే అక్కడున్న నౌకాదళ సిబ్బంది స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌‌ దగ్గరికి చేరుకొని అందులోని వ్యోమగాములను నౌకలోకి ఎక్కించుకున్నారు. ఆ వెంటనే వారందరికీ అత్యవసర వైద్యం అందించారు. ఇదంతా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) సోమవారం రాత్రి ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.మన దేశం చేయనున్న గగన్ యాన్ ప్రయోగం కూడా అచ్చం ఇలాగే ఉండబోతోంది.

Also Read :Bharat Shakti Exercise : గర్జించిన పోఖ్రాన్‌.. యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లతో సందడి

భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్​యాన్ మిషన్ కోసం ఇస్రో చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. వాయుసేన గ్రూప్​ కెప్టెన్లు​ ప్రశాంత్​ బాలకృష్ణన్​ నాయర్​, అజిత్​ కృష్ణన్, అంగద్​ ప్రతాప్, వింగ్​ కమాండర్​ శుభాంశు శుక్లాను గగన్ యాన్ కు వ్యోమగాములుగా ఎంపిక చేసింది. వీరిని గత నెల ప్రధాని మోడీ స్వయంగా పరిచయం చేశారు. కేరళలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్​లో జరిగిన కార్యక్రమంలో లైట్, డార్క్​ బ్లూ రంగులతో కలగలిసిన వెరైటీ యూనిఫాంలో ఉన్న నలుగురు వ్యోమగాములతో మోదీ కరచాలనం చేశారు. అయితే, వారు వేసుకున్న యూనిఫాం డిజైన్​ వెనుక ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. ఆ వ్యోమగాముల్లో స్ఫూర్తినింపేలా నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫ్యాషన్​(నిఫ్ట్​) బృందం ఈ యూనిఫాంను రూపొందించింది. గగన్​యాన్​లో నింగిలోకి వెళ్లబోయే నలుగురు వ్యోమగాముల కోసం లైట్, డార్క్ బ్లూ రంగులు అసిమ్మెట్రిక్ (అసమాన)గా ఉండేలా ఇస్రో యూనిఫాం సిద్ధం చేయించింది. దీన్ని నిఫ్ట్​ బృందం ఎంతో కష్టపడి రూపొందించింది. ఈ యూనిఫాం తయారీకి ఇండియా కాటన్​ను ఉపయోగించారు. ఆకాశాన్ని, శాంతిని ప్రతిబింబించేలా యూత్​ఫుల్​గా కనిపించేలా నీలిరంగుతో అసిమ్మెట్రిక్​ విధానంలో ఈ డిజైన్​ను రూపొందించారు.