Site icon HashtagU Telugu

American Airlines Flight : మరో విమాన ప్రమాదం కలకలం..గాల్లోనే మంటలు

American Airlines Flight

American Airlines Flight

వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను ఖంగారుకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట విమాన ప్రమాదం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా లాస్ వెగాస్‌(Las Vegas)లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నార్త్ కరోలినాలోని షార్లెట్ డగ్లస్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1665 (ఎయిర్‌బస్ A321) (American Airlines flight) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురయ్యింది. విమానం గాల్లో ఉండగానే ఇంజన్ నుంచి దట్టమైన పొగ (smoke come from engine midair), మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. గోల్ఫ్ క్లబ్‌లో ఉన్న స్థానిక వ్యక్తులు పెద్ద శబ్దాలు వినిపించాయని, బాణసంచా లాంటి మంటలు కనిపించాయని తెలిపారు.

Diabetes: డయాబెటిస్ నియంత్రణకు ఒంటె పాలు ఎంతో మేలు చేస్తాయ్.. రోజూ diet‌లో చేర్చాల్సిన కారణాలు ఇవే!

ఘటనను గమనించిన వెంటనే పైలట్ అప్రమత్తమై విమానాన్ని తిరిగి లాస్ వెగాస్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఉదయం 8:20కి విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. మొత్తం 153 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది సభ్యులు గమ్యం చేరుకున్నారు. ఎవరికీ గాయాలు కాకుండా అత్యంత జాగ్రత్తగా విమానాన్ని నడిపించిన పైలట్‌లు ప్రశంసలు అందుకున్నారు. విమానం మళ్లీ గేట్‌ వద్దకు వచ్చి ఆగడం ప్రయాణికులకు ఊరట కలిగించింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ ఘటనను ‘మెకానికల్ ఇష్యూ’గా అభివర్ణించింది. అయితే ఇంజన్‌లో మంటల ఆనవాళ్లు కనిపించలేదని వారి నిర్వహణ బృందం స్పష్టం చేసింది. ప్రమాదం తర్వాత విమానాన్ని సర్వీసు నుంచి తొలగించి మరింత పరిశీలన చేపట్టనున్నారు. ఈ సంఘటనతో విమాన భద్రత, అత్యవసర చర్యలపై చర్చ మళ్లీ ప్రారంభమవుతోంది. ప్రయాణికులు మాత్రం గాల్లో మంటలు చూసిన అనుభవాన్ని ఇంకా మరచిపోలేకపోతున్నారు.