Site icon HashtagU Telugu

Plane Crash : షాపింగ్‌ మాల్‌‌పైకి దూసుకెళ్లిన విమానం.. ఆరుగురు మృతి

Us Plane Crash Philadelphia Missouri Usa

Plane Crash : అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. విమానాలు సురక్షితమేనా ? అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి.  తాజాగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉన్న ఒక షాపింగ్‌మాల్‌ సమీపంలో విమానం కూలింది. ఈ ఘటనలో అక్కడున్న ఇళ్లు, కార్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫిలడెల్ఫియా ఈశాన్య ప్రాంతంలోని ఒక షాపింగ్‌మాల్‌ సమీపంలో విమానం టేకాఫ్‌ అయింది. టేకాఫ్ జరిగిన కాసేపటికే, అది  ఇళ్లపై కూలిపోయిందని వైరల్ అవుతున్న వీడియోలను బట్టి తెలుస్తోంది. చనిపోయిన ఆరుగురిలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ప్రమాదానికి గురైన విమానాన్ని(Plane Crash) ‘లీఆర్‌జెట్‌ 55’గా గుర్తించారు. అది మిస్సోరీకి బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Also Read :Banks Big Changes : బ్యాంకుల టైమింగ్స్.. ప్రతివారం వర్కింగ్ డేస్.. బిగ్ అప్‌డేట్?

సాంకేతిక లోపం వల్లే ఈ విమాన ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్‌ జోష్‌ శాప్రియా స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫెలడెల్ఫియా ఎయిర్‌పోర్టు నుంచి నిత్యం బిజినెస్‌ సంబంధిత జెట్స్‌, చిన్న సైజు విమానాల రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి.

Also Read :AP Gold Hub : దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌హబ్‌ ఏపీలో.. ఏమేం ఉంటాయంటే..

విమానం, సైనిక హెలికాప్టర్‌ ఢీ.. కొత్త అప్‌డేట్

శుక్రవారం ఉదయమే అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్‌ ఢీకొని, నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 64 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ టవర్‌లో సిబ్బంది కొరత వల్లే ప్రమాదం జరిగిందనే అంచనాకు వచ్చారు. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లను, విమానాలను ఒకే కంట్రోలర్‌ ఏకకాలంలో నియంత్రించినట్లు వెల్లడైంది. సాధారణంగా ఈ పనులకు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు విధుల్లో ఉండాలి. కానీ, ఒక్కరే ఆ పనిచేయడంతో.. కంట్రోల్ చేయలేకపోయారని, సరైన ఆదేశాలను సకాలంలో ఇవ్వలేకపోయారని తేలింది.  ఈ అంశాలను స్వయంగా ఇంటర్నేషనల్‌ ప్రిలిమినరీ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ గుర్తించినట్లు తెలిసింది.