Sleeping Prince : ఆయన ఒక యువరాజు. పేరు.. అల్ వహీద్ బిన్ ఖలీద్. రూ.వేల కోట్ల సంపద ఉంది. కానీ విధి వక్రించి కోమాలోకి వెళ్లారు. 2005లో జరిగిన కారు ప్రమాదంలో అల్ వహీద్ తీవ్రంగా గాయపడ్డారు. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. ఏకంగా గత 20 ఏళ్లుగా ఆయన కోమాలోనే ఉన్నారు. ఇప్పుడు 36 ఏళ్ల ఏజ్‌లోనూ కోమా దశలోనే ఆస్పత్రి మంచంపై అల్ వహీద్ జీవనం గడుపుతున్నారు. రియాద్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీ కాలేజీలో ఆయన చికిత్స అందిస్తున్నారు. ట్యూబ్ ద్వారానే అల్ వహీద్‌కు ఆహారాన్ని అందిస్తున్నారు. ఏదో ఒకరోజు తమ కుమారుడు కళ్లు తెరుస్తాడనే ఆశతో తల్లిదండ్రులు ఖాలిద్ బిన్ తలాల్, ప్రిన్సెస్ రీమా కాలం వెళ్లదీస్తున్నారు. ఇరవై ఏళ్లు గడుస్తున్నా అల్ వహీద్ ఆరోగ్యంలో పురోగతి కనిపించడం లేదు.
Also Read :Telangana CS : తెలంగాణ సీఎస్‌గా రామకృష్ణారావు.. భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఇక కోలుకోడని డాక్టర్లు చెప్పినా..
సౌదీ రాజ కుటుంబానికి చెందిన యువరాజు ఖాలిద్ బిన్ తలాల్ అల్ సౌద్(Sleeping Prince) కుమారుడే అల్-వహీద్. ఆయన బ్రిటన్‌లోని మిలిటరీ కాలేజీలో చదివేవాడు. గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్నందున ఆయన్ను ‘స్లీపింగ్ ప్రిన్స్’ అని పిలుస్తుంటారు. ‘‘ప్రమాదంలో నా కొడుకు చనిపోవాలని భగవంతుడు కోరుకుంటే.. ఇప్పుడు అతడు సమాధిలో ఉండేవాడు. కానీ అలా జరగలేదు’’ అని ఖాలిద్ బిన్ తలాల్ చెప్పుకొచ్చారు. కోమాలో ఉన్న యువరాజు కోలుకునే అవకాశం లేదని 2015లోనే డాక్టర్లు చెప్పారు. అయితే ఆ మాటలను ఖాలిద్ బిన్ తలాల్ పట్టించుకోలేదు. ఎప్పుడైనా ఏదైనా అద్భుతం జరిగి తన కుమారుడు కోలుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు అనుగుణంగానే 2019లో ఓసారి అల్-వహీద్ కోలుకుంటున్నట్లు అనిపించింది. ఆయన చేతివేళ్లు కదిలించారు. తలను అటూఇటు ఊపారు. దీంతో యువరాజు కుటుంబంలో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత మళ్లీ ఎటువంటి పురోగతి కనిపించలేదు.
Also Read :Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిపై రష్యా, చైనాలతో దర్యాప్తు : పాక్
‘స్లీపింగ్ ప్రిన్స్’ అల్ వహీద్ తాత పేరు ప్రిన్స్ తలాల్. ఆధునిక సౌదీ అరేబియా రూపకర్త అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌కు ఉన్న అనేకమంది కుమారుల్లో ప్రిన్స్ తలాల్ ఒకరు. అల్ వహీద్‌కు ప్రస్తుత సౌదీ అరేబియా రాజు అబ్దుల్ అజీజ్ ముత్తాత అవుతారు.