Transgender : అమెరికా కాంగ్రెస్‌లోకి తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ అడుగు పెట్టబోతోంది. ఆమె పేరు.. సారా ఎలిజబెత్ మెక్‌బ్రైడ్. వయసు 34 ఏళ్లు. డెలావర్ రాష్ట్రంలోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సారా గెలిచారు. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఆమె రికార్డును సొంతం చేసుకున్నారు. ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ స్థానంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ వేలెన్‌తో సారా మెక్‌బ్రైడ్(Transgender) తలపడ్డారు. సారాకు 95శాతం ఓట్లు పోల్ కాగా, వేలెన్‌కు 57.9 శాతం ఓట్లే వచ్చాయి.
Also Read :Prashanth Reddy : కన్సాస్‌లో పోరాడి ఓడిన తెలుగుతేజం ప్రశాంత్ రెడ్డి
సారా ఎలిజబెత్ మెక్‌బ్రైడ్ ఎవరు ?
- సారాకు ఈ విజయం రాత్రికి రాత్రి దక్కలేదు. దాని వెనుక ఎంతో శ్రమ ఉంది.
- డెలావర్ రాష్ట్ర అటార్నీ జనరల్ పదవి ఎన్నిక కోసం 2006 సంవత్సరంలో జో బైడెన్ కుమారుడు బ్యూ బైడెన్ చేసిన ప్రచారంలో సారా ఎలిజబెత్ మెక్‌బ్రైడ్ కీలక పాత్ర పోషించారు. తద్వారా ఆయనకు సన్నిహితమయ్యారు. అప్పటికి సారా వయసు 18 ఏళ్లే.
- ఎన్నికల ప్రచారం ఫలించి బ్యూ బైడెన్ అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు.
- 2007 నుంచి 2015 వరకు డెలావర్ రాష్ట్రానికి అటార్నీ జనరల్‌గా బ్యూ బైడెన్ వ్యవహరించారు.
- దీంతో డెలావర్ రాష్ట్రంలోని డెమొక్రటిక్ పార్టీలో కీలకంగా వ్యవహరించే అవకాశం సారాకు దక్కింది.
- డెలావర్‌లో తాను చదువుతున్న యూనివర్సిటీలో 2012 ఏప్రిల్‌లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో సారా పోటీ చేశారు. దానిలో గెలిచి సారా ఆ విద్యార్థి విభాగానికి ప్రెసిడెంట్ అయ్యారు.
- మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా డెమొక్రటిక్ పార్టీ నాయకుడే. బ్యూ బైడెన్ సిఫారసుతో సారాకు వైట్ హౌస్‌లో కొన్ని నెలలపాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని ఒబామా కల్పించారు.
- 2016 సంవత్సరంలో జరిగిన డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో సారాకు ప్రసంగించే అవకాశం లభించింది.
- 2020 డెలావర్ రాష్ట్ర 1వ సెనేట్ డిస్ట్రిక్ట్ ఎన్నికల్లో సారా పోటీ చేసి గెలిచారు.
- వాస్తవానికి 2010 సంవత్సరం నుంచి డెలవేరియన్ ఓటర్లు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకే మద్దతు ఇస్తున్నారు.