Israel Vs US : అమెరికాకు ఇజ్రాయెల్ వార్నింగ్.. ఇజ్రాయెలీ సైనికులపై అగ్రరాజ్యం ఆంక్షలు ?

Israel Vs US : పాలస్తీనాలో రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఒక ప్రాంతం పేరు గాజా, మరో ప్రాంతం పేరు వెస్ట్ బ్యాంక్.

  • Written By:
  • Updated On - April 21, 2024 / 01:02 PM IST

Israel Vs US : పాలస్తీనాలో రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఒక ప్రాంతం పేరు గాజా, మరో ప్రాంతం పేరు వెస్ట్ బ్యాంక్. గాజాలో మిలిటెంట్ సంస్థ హమాస్ అధికారంలో ఉంది. వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ సంస్థ అధికారంలో ఉంది. వెస్ట్ బ్యాంకులోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకొని యూదులు తమ కాలనీలను నిర్మించుకున్నారు. అక్కడి యూదులను రక్షణ కల్పించేందుకు స్థానిక యూదు పౌరులతో ఇజ్రాయెల్ ఆర్మీ ఏర్పాటు చేసిన సాయుధ దళం పేరు ‘నెత్జా యెహుదా’. ఈ బెటాలియన్‌కు అన్ని రకాల ఆయుధాలను ఇజ్రాయెల్ సైన్యం సప్లై చేస్తుంటుంది. వీరికి ట్రైనింగ్, శాలరీలు, ఇతర ప్రోత్సాహకాలను ఇజ్రాయెల్ ప్రభుత్వమే ప్రతినెలా చెల్లిస్తుంటుంది. తాజా అప్‌డేట్ ఏమిటంటే..

We’re now on WhatsApp. Click to Join

తాజాగా ఇజ్రాయెల్ మిత్రదేశం(Israel Vs US) అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో పాలస్తీనియులను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ.. వారిపై సాయుధ దాడులకు పాల్పడుతు న్నందుకుగానూ ‘నెత్జా యెహుదా’ సైనిక బెటాలియన్‌పై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. ఆ బెటాలియన్‌లో పనిచేస్తున్న వారిపై కఠినమైన ఆంక్షలను అమలు చేయాలని, మొత్తం బెటాలియన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని భావిస్తోంది. దీనిపై అమెరికా మీడియాలో సంచలన కథనాలు ప్రచురితమయ్యాయి.

Also Read :Credit Card Myths : క్రెడిట్ కార్డులపై షాకింగ్ అపోహలు ఇక పటాపంచలు !

ఈ కథనాలపై ఇజ్రాయెల్‌లోని బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. తమ సైన్యంలోని కీలకమైన బెటాలియన్‌పై ఆంక్షలు విధించాలనే ఆలోచన కూడా సరికాదని ప్రకటించింది. తమ సైన్యం జోలికి వస్తే.. ఆంక్షల పేరుతో వేధింపులకు దిగితే.. ఊరుకునేది లేదని నెతన్యాహూ సర్కారు తేల్చి చెప్పింది. రెడ్ లైన్‌ను దాటొద్దని తన పెద్దన్న అమెరికాకు ఇజ్రాయెల్ వార్నింగ్ జారీ చేసింది. ‘‘మా సైనికులు తీవ్రవాద భూతాలతో పోరాడుతున్నారు, మా సైన్యంపై ఆంక్షలు విధించాలనే ఆలోచన సరికాదు. అది అనైతికం’’ అని నెతన్యాహు అన్నారు. అమెరికా ఒకవేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే..  అన్ని మార్గాల ద్వారా వ్యతిరేకతను తప్పకుండా తెలియజేస్తామని వెల్లడించారు. ఇజ్రాయెల్ మంత్రులు ఇటమార్ బెన్ జివిర్, బెజాలెల్ స్మోట్రిచ్ కూడా అమెరికా చర్యను తప్పుబట్టారు. ‘నెత్జా యెహుదా’ బెటాలియన్‌కు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈమేరకు వారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌ను రిక్వెస్ట్ చేశారు.  అమెరికా ఆజ్ఞలకు లొంగవద్దని పిలుపునిచ్చారు.

Also Read :Baby Powder Vs Cancer : బేబీ పౌడర్ వాడిన మహిళకు రూ.375 కోట్లు.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు కోర్టు ఆర్డర్