Chessboard Killer : మీకు చెస్ బోర్డ్ తెలుసు కదూ. చెస్ బోర్డ్‌లో ఎన్ని గడులు ఉంటాయి ? 64. ఒక సీరియల్ కిల్లర్ చెస్ బోర్డులోని 64 గడులన్నీ నింపాలనే పిచ్చి టార్గెట్‌తో దారుణ హత్యలకు పాల్పడ్డాడు. ప్రతీ మర్డర్ చేసిన వెంటనే.. అతగాడు తన చెస్ బోర్డుపై ఉండే ఒక్కో గడిపై క్రాస్ మార్క్ పెడుతుండేవాడు. ఇలా ఏకంగా 63 మర్డర్‌లు చేశానని రష్యాకు చెందిన ‘చెస్‌బోర్డ్ కిల్లర్’ 50 ఏళ్ల అలెగ్జాండర్ పిచుస్కిన్ అంగీకరించారు. గతంలో ఇతగాడు 52 మందిని చంపినట్లు అంగీకరించారు. మరో 11 మందిని కూడా తానే మర్డర్ చేశానని తాజాగా పిచుస్కిన్ ఒప్పుకున్నాడు.
అలెగ్జాండర్ పిచుస్కిన్ సీరియల్ కిల్లింగ్స్
- అలెగ్జాండర్ పిచుస్కిన్ 1974 ఏప్రిల్ 9న రష్యాలోని మైతిశ్చి నగరంలో జన్మించాడు.
- పుట్టినప్పటి నుంచే అలెగ్జాండర్ మానసికంగా బలహీనంగా ఉండేవాడు. దీంతో మానసిక దివ్యాంగుల స్కూలులో అతడిని తల్లిదండ్రులు చేర్పించారు.
- ఆ స్కూలులో తోటి విద్యార్థులు అలెగ్జాండర్‌ను కించపరిచే వారు. వేధించేవారు. దీంతో వారిపై అతడికి కోపం రావడం మొదలైంది.
- పాఠశాల విద్య కొనసాగుతుండగానే.. అలెగ్జాండర్‌ను కొన్నాళ్ల పాటు వాళ్ల తాతయ్య (అమ్మ వాళ్ల నాన్న) ఇంటికి పంపారు. అక్కడే అలెగ్జాండర్‌కు చెస్ నేర్పించారు.
- మానసిక బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేయడం కంటే మేధస్సును పెంచుకోవడమే బెటర్ అని అలెగ్జాండర్‌కు(Chessboard Killer) తాతయ్య చెప్పేవారు. అందుకే ఆయన తన మనవడికి చెస్ నేర్పించేవారు.
- తాతయ్య చనిపోయాక.. అలెగ్జాండర్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులోనే చెస్ ఆడేవాడు. క్లబ్‌లకు వెళ్లేవాడు.
Also Read :BJP Vs MIM : మజ్లిస్‌తో బీజేపీ ‘లోకల్’ ఫైట్.. బీఆర్ఎస్‌కు పరీక్షా కాలం!
మిత్రుడు మిఖాయిల్‌తో కలిసి ప్లాన్.. చివరకు అతడినే..
- చిన్న పిల్లలు కనిపిస్తే వాళ్ల కాళ్లను పట్టుకొని.. తలకిందులుగా వేలాడదీసే వాడు. నేను వదిలేస్తే ఏమవుతుందో తెలుసుగా అంటూ టార్చర్ చేసి ఆనందించే వాడు. వాళ్లతో క్షమాపణలు చెప్పించుకునేవాడు.
- ఆండ్రే చికాటిలో అనే మరో సీరియల్ కిల్లర్ నుంచి అలెగ్జాండర్ స్ఫూర్తి పొందాడు. గతంలో ఆండ్రే చికాటిలో 52 మంది పిల్లలను మర్డర్ చేశాడు. తాను చెస్ గడిలో ఉన్న 64 నంబర్లకు సరిపడా మర్డర్లు చేయాలని అలెగ్జాండర్ డిసైడయ్యాడు. తన ఆప్త మిత్రుడు మిఖాయిల్ ఒడిత్చుక్‌తో కలిసి 64 మర్డర్లు చేయాలని అలెగ్జాండర్ భావించాడు.
- 1992 జులై 27న అలెగ్జాండర్ తొలి మర్డర్ చేశాడు. తన మిత్రుడు మిఖాయిల్‌నే హత్య చేశాడు. వాళ్లిద్దరూ బిట్సెవ్స్కీ పార్క్‌లో కలిశారు. అయితే తాను 64 మర్డర్ల ప్లాన్‌లో భాగం కాలేనని మిఖాయిల్ చెప్పడంతో అలెగ్జాండర్‌కు కోపం వచ్చింది. దీంతో మిఖాయిల్‌ను చంపేశాడు.
- అలెగ్జాండర్ తన చివరిదైన 63వ మర్డర్‌ను 2006 జూన్ నెలలో చేశాడు. మారినా మోస్కా ల్యోవాను హత్య చేశాడు. అయితే తాను అలెగ్జాండర్‌తో కలిసి వాకింగ్‌కు వెళ్తున్న విషయాన్ని ముందే మారినా తన కొడుకుకు చెప్పింది. దీంతో ఈవిషయాన్ని పోలీసులకు మారినా కొడుకు చెప్పాడు. దీంతో వారు అలెగ్జాండర్‌ను పట్టుకున్నారు.
- అలెగ్జాండర్‌ను విచారించగా.. మొత్తం 63 సీరియల్ మర్డర్స్ గురించి వివరించాడు.
- 14 ఏళ్ల పాటు దక్షిణ మాస్కోలోని బిట్సెవ్స్కీ పార్క్ చుట్టూ వృద్ధులు, మద్యపానం చేసేవారు, నిరాశ్రయులను తాను హత్య చేశానని పిచుష్కిన్ ఒప్పుకున్నాడు.
- ఈ హత్యల నేపథ్యంలో అలెగ్జాండర్ పిచుస్కిన్ రష్యాలోని మారుమూల ఆర్కిటిక్ ఉత్తర ప్రాంతంలోని పోలార్ ఔల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.