Site icon HashtagU Telugu

65 Dead : 65 మంది మృతి.. కూలిన సైనిక విమానం

65 Dead

65 Dead

65 Dead : 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో వెళ్తున్న రష్యా విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది.  ఉక్రెయిన్‌ సరిహద్దులోని బెల్గోరాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  ప్రమాదం జరిగిన టైంలో ఈ విమానంలో 74 మంది(65 Dead) ప్రయాణిస్తున్నారు. కూలిపోయినది ఒక సైనిక రవాణా విమానమని.. అది IL-76  మోడల్‌కు చెందినదని తెలిసింది. ఆ విమానంలో మరో తొమ్మిది మంది రష్యా సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. అయితే వారు కూడా చనిపోయారా ? లేదా ? అనే దానిపై ఇంకా సమాచారం అందలేదు.  ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు స్పెషల్ మిలిటరీ కమిషన్ ఘటనా స్థలానికి వెళ్తోందని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం అదుపుతప్పి నివాస ప్రాంతాల వద్ద వేగంగా కిందికి పడిపోతున్న సీన్‌లు ఆ వీడియోల్లో  స్పష్టంగా కనిపిస్తున్నాయి. విమానం కూలగానే మంటలు చెలరేగాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఆ విమానంలో రష్యా క్షిపణులు ఉన్నాయని ఉక్రెయిన్‌ మీడియా కథనం పేర్కొంది. రష్యా మాత్రం అందులో యుద్ధ ఖైదీలు ఉన్నారని అంటోంది. దీనిపై రష్యా పార్లమెంట్ స్పీకర్ మాట్లాడుతూ.. ‘సొంత సైనికులు వెళ్తున్న విమానాన్ని వారు కూల్చివేశారు. మానవతా మిషన్‌లో భాగమైన మా పైలట్లు దానిలో ఉన్నారు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఈ సైనిక రవాణా విమానం(IL-76)లో బలగాలు, సరకులు, సైనిక సాధనాలను తరలించే వీలుంది. ఇది భారత వైమానిక దళంలో కూడా విధులు నిర్వర్తిస్తోంది. ఇల్యుషిన్-76 అనేది సైనిక రవాణా విమానం. ఇది సైనిక పరికరాలు, ఆయుధాలను ఎయిర్‌లిఫ్ట్ చేయడానికి రూపొందించారు. ఇది ఐదుగురు సిబ్బందిని కలిగి ఉండగా..90 మంది ప్రయానించే వీలుంటుంది.

Also Read :Ayodhya – Sitaram : అయోధ్యలో సీతాసమేతంగా రాముడిని ఎందుకు ప్రతిష్ఠించలేదు? చాగంటి వివరణ ఇదీ

రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో క్షిపణి దాడి స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం ఉదయం డొనెట్స్క్‌లోని టెక్ట్స్‌ల్షిక్‌ మార్కెట్‌పై జరిగిన క్షిపణి దాడిలో కనీసం 27 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో 25 మందికి గాయాలు కాగా.. వీరిని ఆస్పత్రికి తరలించినట్లు ఆ ప్రాంతంలోని రష్యా అధికారి ఒకరు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ఉక్రెయిన్‌ సైన్యమే ఈ దాడికి పాల్పడినట్లు సదరు అధికారి చెప్పారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు కీవ్‌ స్పందించలేదు.