Russia : ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆశలను నింపే ముందడుగును రష్యా శాస్త్రవేత్తలు వేశారు. క్యాన్సర్‌ను అడ్డుకునే వినూత్న వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని, అది వాడకానికి సిద్ధంగా ఉందని రష్యా ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ (ఎఫ్‌ఎంబీఏ) ప్రకటించింది. ‘ఎంటర్‌మిక్స్’ (Entemix) పేరుతో రూపొందించిన ఈ టీకా పై ఏళ్ల తరబడి పరిశోధనలు జరిగాయని, మూడు సంవత్సరాల పాటు ప్రీ-క్లినికల్ స్థాయిలో నిర్వహించిన ప్రయోగాల్లో ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయని ఎఫ్‌ఎంబీఏ అధిపతి వెరోనికా స్క్వోర్త్సోవా వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమని, శక్తివంతమైన ఫలితాలను చూపిందని ఆమె వివరించారు. కొన్ని రకాల క్యాన్సర్లలో కణితుల పెరుగుదలను 60–80 శాతం వరకు అడ్డుకుందని, ప్రయోగ జంతువుల మనుగడ శాతం కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు.
Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి సమయంలో వినియోగించిన ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీనే ఈ టీకాలో కూడా ఉపయోగించారని అధికారులు పేర్కొన్నారు. ఈ పద్ధతిలో శరీర కణాలు రోగనిరోధక వ్యవస్థను శిక్షణ ఇచ్చే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. దీని వలన క్యాన్సర్ కణాలపై శరీరం స్వయంగా దాడి చేయగలుగుతుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను మొదటగా పెద్దప్రేగు క్యాన్సర్ చికిత్సలో ప్రవేశపెట్టనున్నారని, త్వరలోనే వేగంగా వ్యాపించే మెదడు క్యాన్సర్ (గ్లయోబ్లాస్టోమా), కంటి క్యాన్సర్ మరియు చర్మ క్యాన్సర్ (మెలనోమా) కోసం ప్రత్యేక వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని ఎఫ్‌ఎంబీఏ అధికారులు వెల్లడించారు.