Spacecraft Crash : ఈనెల (మే) 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో కీలక పరిణామం జరగబోతోంది. సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయిన ఒక స్పేస్ క్రాఫ్ట్ (అంతరిక్ష నౌక) భూమిపై పడబోతోంది. అది భారతదేశంలో పడుతుందా ? ఎక్కడ పడుతుంది ? ఆ స్పేస్ క్రాఫ్ట్ భూమిని తాకిన తర్వాత ఏం జరుగుతుంది ? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Shobhan Babu : తాత స్టార్ యాక్టర్.. మనవడు స్టార్ డాక్టర్..
భూమిపైకి దూసుకొస్తున్న స్పేస్ క్రాఫ్ట్ గురించి..
- మనం చెప్పుకుంటున్న స్పేస్ క్రాఫ్ట్ పేరు.. కాస్మోస్ 484.
- ఇది అలనాటి సోవియట్ యూనియన్ (రష్యా)కు చెందిన స్పేస్ క్రాఫ్ట్.
- దీన్ని 1972 మార్చి 31న కజకిస్తాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించారు.
- శుక్రగ్రహంపై పరిశోధనల కోసం కాస్మోస్ 484 అంతరిక్ష నౌక(Spacecraft Crash)ను ప్రయోగించారు. అయితే ఆ ప్రయోగం ఫెయిలైంది.
- అయినప్పటికీ సదరు స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో 53 ఏళ్లపాటు తిరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు అది సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి భూమిపై పడబోతోంది.
- శుక్ర గ్రహం ఉపరితలంపై దిగేలా కాస్మోస్ 484 స్పేస్ క్రాప్ట్ ల్యాండింగ్ మాడ్యూల్‌ను బలంగా రూపొందించారు. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, అత్యధిక ఉష్ణోగ్రతలతో రూపొందించారు. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఎదుర్కొనే దానికంటే అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా దీన్ని తయారు చేశారు.
- దీని బరువు 495 కేజీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- అంతరిక్షం నుంచి గంటకు 242 కి.మీల వేగంతో ప్రయాణిస్తూ వచ్చి ఇది భూమిని తాకుతుందని భావిస్తున్నారు.
- ఈ అంతరిక్ష నౌక భూమిని తాకగానే ఉత్పన్నమయ్యే ఇంపాక్ట్ ఎనర్జీ దాదాపు 1.1 నుంచి 1 ఎంజే దాకా ఉంటుంది. ఇది కొన్ని వందల గ్రాముల డైనమైట్ పేలుళ్లకు సమానం.
- కాస్మోస్ 484 స్పేస్ క్రాఫ్ట్ మే 8 నుంచి 14వ తేదీ మధ్య ఏ క్షణమైనా భూమిపై లేదా సముద్రంలో పడొచ్చని భావిస్తున్నారు.
- కాస్మోస్ 484 అంతరిక్ష నౌక మార్గంలో ఈజిప్ట్ , సిరియా, తుర్కియే, అజర్‌బైజాన్ వంటి దేశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ దేశాల్లో స్పేస్ క్రాఫ్ట్ పడకుంటే, అది మధ్యధరా సముద్రంలో పడుతుందని అంచనా వేస్తున్నారు.