Russia : అమెరికాకు చెక్.. ఉత్తర కొరియాతో పుతిన్ మెగా డీల్.. ఏమిటి ?

దీనికి సంబంధించిన ఒక చట్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russia) సంతకం చేసి ఆమోదించారని సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Russia North Korea Putin Kim Jong Un

Russia :  ‘నాటో’ కూటమి గురించి మనకు తెలుసు. ‘నాటో’ అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ సంస్థలో ఐరోపా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఏదైనా ఐరోపా దేశంపై ఎటాక్ జరిగితే.. ఇతర ఐరోపా దేశాలన్నీ కలిసి సైనికంగా ప్రతిఘటిస్తాయి. ఇప్పుడు అలాంటి ఫార్ములానే రష్యా అధ్యక్షుడు పుతిన్ తయారు చేయబోతున్నారు. ఈ దిశగా తొలి అడుగు పడింది. ఈవిధమైన పరస్పర సైనిక సహకారం గురించి ఉత్తర కొరియాతో రష్యా డీల్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక చట్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russia) సంతకం చేసి ఆమోదించారని సమాచారం. ఈ ఏడాది జూన్‌లో పుతిన్ ఉత్తర కొరియా పర్యటన సందర్భంగానే ఈ డీల్ ఓకే అయిందని తెలిసింది. అప్పట్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ అయిన పుతిన్.. ద్వైపాక్షిక సైనిక సహకారంపై ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని మీడియాలో  కథనాలు వస్తున్నాయి.

Also Read :Elevated Corridor : తెలంగాణ, ఏపీ నడుమ ఎలివేటెడ్‌ కారిడార్‌.. హైట్ 30 అడుగులు

ఈ అంశంతో ముడిపడిన ఒక చట్టంపై పుతిన్ సంతకం చేసిన.. అక్టోబరు 15న రష్యా ప్రభుత్వ చట్టసభ డ్యూమాకు పంపారట.  దీనికి వెంటనే రష్యా డ్యూమాలోని ఎగువ సభ, దిగువ సభలు ఆమోదం తెలిపాయి. ఈవిధంగా రష్యా, ఉత్తర కొరియాల మధ్య ద్వైపాక్షిక సైనిక సహాయం కోసం ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే ఇప్పుడు వేలాది మంది ఉత్తర కొరియా సైనికులు రష్యాకు చేరుకున్నారు. భవిష్యత్తులో ఉత్తర కొరియాపై ఏ దేశమైన దాడి చేస్తే.. అక్కడి రష్యా తన సైనికులను పంపించి సహాయం చేస్తుంది. మొత్తం మీద ఈ పరిణామాలు కొరియా ద్వీపకల్పంలో అణ్వస్త్ర యుద్దానికి బాటలు వేసేలా ఉన్నాయి. ఇప్పటికే అమెరికా సేనలు దక్షిణ కొరియాలో ఉన్నాయి. దక్షిణ కొరియా సముద్ర జలాల్లో అణ్వస్త్ర యుద్ధ నౌకలను అమెరికా మోహరించింది. భవిష్యత్తులో ఉత్తర కొరియా వైపు రష్యా రంగంలోకి దిగనుంది. దీంతో అక్కడ అమెరికా ఆధిపత్యానికి చెక్ పడబోతోంది. పుతిన్ కోరుకుంటున్నది కూడా అదే.

Also Read :Delhi Ganesh : ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత..!

  Last Updated: 10 Nov 2024, 09:46 AM IST