Putin Fifth Term : రష్యాలో మొదలైన ఓట్ల పండుగ.. పుతిన్‌‌కు ఓటమా ? గెలుపా ?

Putin Fifth Term : రష్యా అనగానే తొలుత గుర్తుకొచ్చే పేరు పుతిన్.

  • Written By:
  • Updated On - March 15, 2024 / 12:02 PM IST

Putin Fifth Term : రష్యా అనగానే తొలుత గుర్తుకొచ్చే పేరు పుతిన్. వరుసగా నాలుగు టర్మ్‌లు దేశ అధ్యక్ష పీఠంపై కంటిన్యూ అయితే వచ్చిన పాపులారిటీ ఇది. ఐదో టర్మ్ కూడా తాను అధ్యక్షుడిగా కొనసాగాలని పుతిన్ భావిస్తున్నారు. ఆయన ఆకాంక్ష నెరవేరుతుందా ? లేదా ? అనేది రష్యా ప్రజలు డిసైడ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన పోలింగ్ నేటి నుంచి మార్చి 17 వరకు జరగనుంది. వాస్తవానికి ఒక్కరోజులోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రతీసారి జరుగుతుంటుంది. కానీ ఈ దఫా రష్యా చరిత్రలో తొలిసారిగా మూడు రోజుల పాటు పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న నాలుగు ఉక్రెయిన్‌ రీజియన్‌లలో కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందుకే పోలింగ్‌కు అంతటా టైం కేటాయించారని తెలుస్తోంది.  ఈసారి 11.42 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అర్హులైన ఓటర్లు విదేశాల్లో ఉన్నా సరే ఓటేయొచ్చు. మార్చి 19 కల్లా తొలి దఫా ఫలితాలు వెల్లడి కావచ్చు. తుది ఫలితాలు తెలియాలంటే మార్చి 29వ తేదీకా ఆగాల్సిందే. 2018 గత అధ్యక్ష ఎన్నికల్లో 68 శాతం పోలింగ్‌ నమోదైంది.

We’re now on WhatsApp. Click to Join

ఈసారి అధ్యక్ష ఎన్నికల బరిలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో పాటు ఎల్‌డీపీఆర్‌ నేత లియోనిడ్‌ స్లట్‌స్కీ, న్యూ పీపుల్‌ పార్టీ నేత వ్లాదిస్లేవ్‌ దవాన్‌కోవ్, కమ్యూనిస్ట్‌ పార్టీ నేత నికోలే ఖరిటోనోవ్‌లు బరిలో ఉన్నారు. పుతిన్‌ను వీరంతా విమర్శిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని మాత్రం వ్యతిరేకించడం లేదు. వారు ఈ వాదించడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేమిటంటే.. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) బ్యాన్ చేస్తోంది. ‘‘ఉక్రెయిన్‌తో యుద్ధం మనకు అవసరమా ?’’ అని కామెంట్ చేసినందుకు ఏకైక విపక్ష నేత బోరిస్‌ నదేహ్‌దిన్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా సీఈసీ నిషేధం విధించింది.  ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ కంట్రోల్‌లో సీఈసీ పనిచేస్తుంటుంది. తాను యుద్ధంలోకి రష్యాను నెడుతూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకుండా పుతిన్ ఇలాంటి నిరంకుశ చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.

Also Read :Russia – Kerala – Polls : రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో పోలింగ్.. ఎందుకు ?

రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ ఇప్పటికే నాలుగు సార్లు(2000, 2004, 2012, 2018) అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 2008లో దేశ ప్రధానిగానూ ఆయన సేవలు అందించారు. విపక్ష నేత అలెక్సీ నావల్నీ గత నెలలో జైలులో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. దాని ఎఫెక్టు ఎన్నికల్లో ఉంటుందా ? ఉండదా ? అనేది వేచిచూడాలి.  రష్యా అధ్యక్ష రేసులో పుతిన్‌(Putin Fifth Term) విజయబావుటా ఎగరేస్తారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  పౌర హక్కులను కాలరాస్తూ, నియంత పోకడలతో దేశాన్ని ఏలుతున్న పుతిన్‌ పాలనకు అంతం పలుకుతామంటూ విపక్ష పార్టీల నేతలు ప్రతినబూనారు. దేశ ఓటర్లలో పుతిన్‌కు 75 శాతం మద్దతు ఉందని, ఈ ముగ్గురు తలో 5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని ముందస్తు పోలింగ్‌ అంచనాలు విశ్లేషిస్తున్నాయి.

Also Read :Population Census : జనగణనకు భారత్ రెడీ.. ఏమేం చేస్తారో తెలుసా ?