Russia Vs Ukraine : ఉక్రెయిన్ ఆర్మీ కొన్ని రోజుల క్రితమే అకస్మాత్తుగా రష్యా సరిహద్దులోని పలు ప్రాంతాలలోకి చొరబడింది. వెయ్యి మందికిపైగా ఉక్రెయిన్ సైనికులతో కూడిన యూనిట్ దాదాపు 30 కిలోమీటర్లు మేర ఉక్రెయిన్‌లోకి చొచ్చుకెళ్లింది. ఈక్రమంలోనే రష్యాలోని నైరుతి భాగంలో ఉండే కస్క్ ప్రాంతంపైనా ఉక్రెయిన్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. దీంతో అక్కడ రష్యా ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. ఉక్రెయిన్ సైనికులను(Russia Vs Ukraine) ఎదుర్కొనేందుకు అక్కడికి పెద్దసంఖ్యలో సైనికులను పంపుతోంది.
We’re now on WhatsApp. Click to Join
బార్డర్ దాటి తమ దేశంలోకి వచ్చిన దాదాపు వందలాది మంది ఉక్రెయిన్ సైనికులను ఇప్పటికే మట్టుబెట్టామని రష్యా ఆర్మీ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని లిపెట్క్స్ ప్రాంతంపై దాడులు చేశాయి. దీనిపై స్పందించిన రష్యా ఆర్మీ ఉక్రెయిన్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడింది. రష్యాకు చెందిన మిస్సైళ్లు ఉక్రెయిన్‌లోని ఓ షాపింగ్ మాల్‌పై పడటంతో 14 మంది చనిపోయారు. 44 మందికి గాయాలయ్యాయి.
Also Read :Plane Crash : జనావాసాల్లో కుప్పకూలిన విమానం.. 62 మంది ప్రయాణికుల మృతి
ఇక కుర్స్క్ ప్రాంతంలోని పలు నగరాలను ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆయా నగరాలకు అదనపు బలగాలను పంపుతున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాకెట్ లాంచర్‌లు, ఫిరంగులు, తుపాకులు, యుద్ద ట్యాంకులను పంపుతున్నట్లు తెలిపింది. రష్యా సరిహద్దు నుంచి 10 కిలోమీటర్లు లోపలికి ఉన్న సుద్జా పట్టణం శివార్లలో ఉక్రెయిన్ దళాలతో రష్యా ఆర్మీ పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఈవివరాలను రష్యా ఆర్మీ కూడా ధ్రువీకరించింది. రష్యా నుంచి ఐరోపాకు సహజ వాయువును ఎగుమతి చేసే ఏకైక పైప్‌లైన్ ట్రాన్సిట్ హబ్ సుద్జా పట్టణంలోనే ఉంది.
Also Read :Aman Sehrawat: భారత్‌కు ఆరో మెడల్.. రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు కాంస్యం
ఇక ఈ యుద్ధం మొదలైన ఆరంభంలో 2022 అక్టోబరులో పెద్దసంఖ్యలో ఉక్రెయిన్‌లో మరణాలు చోటుచేసుకున్నాయి. రష్యా దాడుల వల్ల మళ్లీ ఈ ఏడాది జులైలో అంత భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. ఈవివరాలను ఉక్రెయిన్‌లోని ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ మానిటరింగ్ మిషన్ వెల్లడించింది. జులైలో కనీసం 219 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించగా, 1,018 మంది గాయపడ్డారని తెలిపింది.