Saudi: సౌదీ గ్రాండ్ మసీదులో స్వాగతం పలుకుతున్న రోబోలు..

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 11:56 AM IST

Saudi Arabia: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (artificial intelligence) అన్ని రంగాల్లోకి వేగంగా ప్రవేశిస్తోంది. ఇప్పటికే కార్పోరేట్ కంపెనీలన్నీ కృత్రిమ మేథను వాడుకుంటూ సిబ్బందిని తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. అదే సమయంలో కృత్రిమ మేథ మతపరమైన అంశాల్లోనూ అండగా నిలుస్తోంది. ఈ పరిజ్ఞానాన్ని వాడుకుని ఏకంగా రోబోల్ని(Robots) రంగంలోకి దింపింది సౌదీ అరేబియా(Saudi Arabia)లోని గ్రాండ్ మసీదు ( grand mosque). ప్రపంచంలోనే ప్రముఖ మసీదుల్లో ఒకటైన ఇందులో ఇప్పుడు రోబోలు స్వాగతం పలుకుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

సౌదీ అరేబియాలోని గ్రాండ్ మసీదులో ఏర్పాటు చేసిన రోబోలు భక్తుల్ని(Devotees) అబ్బుర పరుస్తున్నాయి. ప్రార్ధనల కోసం మసీదుకు వచ్చే వారికి ఆహ్వానం పలుకుతున్నాయి. అంతే కాదు ఇస్లామిక్ అంశాలపై ఏకంగా 11 భాషల్లో భక్తులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాయి. మసీదులో చాలా చోట్ల రోబోలను ఏర్పాటు చేశారు. ఇవి రంజాన్ మాసంలో మసీదుకు వచ్చే భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు ఇస్లామిక్ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాయి.

Read Also: China Vs Arunachal : అరుణాచల్‌‌ప్రదేశ్‌లోని 30 ఏరియాలకు పేర్లు పెట్టిన చైనా

గ్రాండ్ మసీదులో ఏర్పాటు చేసిన రోబోల్లో పెద్ద స్క్రీన్ టచ్ ఎల్‌సిడి అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా ఆధునిక ఇస్లాం గురించి 11 భాషలలో సమాచారం ఇస్తారు. దీని ద్వారా మసీదు మొత్తానికి ఏ సమాచారమైనా ఏకకాలంలో ఇవ్వవచ్చు. ఈ రోబోల ద్వారా మసీదుకు చేరుకున్న ఎవరైనా ఇస్లాంకు సంబంధించిన ఏదైనా ప్రశ్న అడగవచ్చు. ఈ రోబో ద్వారా మత పెద్దల్ని కూడా ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చు. మసీదులో అమర్చిన రోబోలు అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, పర్షియన్, టర్కిష్, ఉర్దూ, చైనీస్ మరియు బెంగాలీతో సహా 11 భాషలలో సమాచారాన్ని అందజేస్తున్నాయి. ఈ భాషల్లో రోబోతో నేరుగా మాట్లాడవచ్చు. రోబోలో 21 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉంది.