Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక పరిణామం జరగబోతోంది. అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్.కెనడీ జూనియర్ ఈ పోటీ నుంచి తప్పుకోనున్నారు. ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించబోతున్నారు. ఈమేరకు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి రాబర్ట్ ఎఫ్.కెనడీ జూనియర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలలో కెనడీకి కేవలం 8.7 శాతం మంది ఓటర్ల మద్దతు మాత్రమే లభించింది. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలగి, ట్రంప్‌కు(Trump) మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
శుక్రవారం రోజు అమెరికాలోని కీలకమైన రాష్ట్రం అరిజోనాలో రాబర్ట్ ఎఫ్.కెనడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ సమావేశం వేదికగా తాను ఎన్నికల బరి నుంచి తప్పుకునే విషయాన్ని ఆయన అనౌన్స్ చేయనున్నారు. అదే రాష్ట్రంలో సరిగ్గా శుక్రవారం రోజే డొనాల్డ్ ట్రంప్ కూడా ఎన్నికల ప్రచారం చేయబోతుండటం గమనార్హం. శుక్రవారం తర్వాతి నుంచి ట్రంప్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా రాబర్ట్ ఎఫ్.కెనడీ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఈ పరిణామం ట్రంప్‌కు కలిసొచ్చే అంశమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఓవైపు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి విషయంలో చాలా నెలల పాటు సందిగ్ధంలో సమయాన్ని వేస్ట్ చేసుకోవాలి. ఇంకోవైపు రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిపై పూర్తి స్పష్టతతో ముందుకుసాగుతోంది. ఈ పరిణామాలు ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీదే పైచేయిగా ఉంటుందనే సంకేతాలను ఇస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Om Shanti : డెమొక్రటిక్ పార్టీ సభలో ‘ఓం శాంతి’.. కమలకు మద్దతుగా పూజారి రాకేశ్ భట్ ప్రసంగం
మరో వైపు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయినా ట్రంప్‌పై సరైన అంశాలతో దాడి చేయలేకపోతున్నారనే అభిప్రాయం ఎన్నికల పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. డొనాల్డ్ ట్రంప్‌పై మహిళలను వేధించారనే అభియోగాలు ఉన్నాయి. ఒక మహిళా అభ్యర్థిగా, అమెరికా మహిళల్లో ఒకరిగా కమలా హ్యారిస్ ఈ అంశాలను ఎన్నికల ప్రచారంలో లేవనెత్తితే చాలా ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.