Site icon HashtagU Telugu

Fire Broke In Lyon City: ఫ్రాన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం

4 killed In Fire

Fire

ఫ్రాన్స్‌లోని లియోన్ నగరానికి సమీపంలోని వాలక్స్-ఎన్-వెలిన్‌లోని నివాస భవనంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఇందులో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 10 మందిలో 5 మంది చిన్నారులు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3.12 గంటలకు మంటలు చెలరేగాయని, ఆ తర్వాత 3.25 గంటలకు 170 మంది అగ్నిమాపక సిబ్బంది, 65 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని లియోన్/రోన్ ప్రాంతం పరిపాలన తెలిపింది.

మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ.. మాస్ డు టౌరో పరిసర ప్రాంతంలోని ఏడు అంతస్తుల అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో మంటలు చెలరేగాయని అత్యవసర సేవలు తెలిపాయి. ఈ ఘటనలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది సహా మరో 10 మంది గాయపడ్డారు. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.

ఈ అగ్ని ప్రమాదం (Fire Accident)లో మరో 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఏడాదిలోనే ఇది అత్యంత భారీ అగ్నిప్రమాదమని అధికారులు చెబుతున్నారు. 43,000 మంది ప్రజలు నివాసం ఉండే వాలక్స్-ఎన్-వెలిన్‌ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం వేళ అక్కడి దృశ్యాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఓ తల్లి కిటికీలో నుంచి తన బిడ్డను బయటకు విసిరింది.

Also Read: Earthquake: టెక్సాస్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదు

ఫ్రెంచ్ ఇంటీరియర్ మినిస్టర్ గెరాల్డ్ డార్మినిన్ మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, అగ్నిప్రమాదానికి గల కారణాలను కనుగొంటానని హామీ ఇచ్చాడు. మంటలు చెలరేగడానికి చాలా కారణాలు ఉండవచ్చు. అయితే కారణం మాకు తెలియదని డార్మినిన్ అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని ఆయన తెలిపారు. ఈ ఘటనలో బాధితుల్లో కొందరికి మూడేళ్ల వయసు కూడా ఉంటుందని సమాచారం.