Site icon HashtagU Telugu

Putin – Heart Attack : పుతిన్‌కు గుండెపోటు.. అబద్ధమా ? నిజమా ?

Independent Candidate Putin

Putin Agrees To China Visit

Putin – Heart Attack : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదివారం రాత్రి 9:05 గంటలకు గుండె పోటుకు గురయ్యారంటూ జోరుగా ప్రచారం జరిగింది. పలు అంతర్జాతీయ మీడియాలలో దీనిపై కథనాలు వచ్చాయి. రష్యాకు చెందిన టెలిగ్రామ్ ఛానెల్ ‘జనరల్ ఎస్‌వీఆర్’ వేదికగా వైరల్ అయిన ఒక మెసేజ్ ఆధారంగా ఈ కథనాలను ప్రచురించారు. గుండెపోటు రావడంతో పుతిన్ తన బెడ్ రూంలో కింద పడిపోయారని ఆయా వార్తా కథనాల్లో ప్రస్తావించారు.  ‘‘హార్ట్ ఎటాక్ రావడంతో పుతిన్ తన  బెడ్‌రూం నుంచి బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ వద్ద కుప్పకూలారు. దీంతో డైనింగ్ టేబుల్ పై ఉన్న ఫుడ్స్ అన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి’’ అని  పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ శబ్దం విన్న సిబ్బంది వెంటనే వచ్చి.. పుతిన్ చికిత్సకు ఏర్పాట్లు చేశారని న్యూస్ స్టోరీస్ లో ప్రస్తావించారు. అంతటితో ఆగకుండా.. పుతిన్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో స్పందించిన రష్యా అధికారులు.. పుతిన్ కు గుండెపోటు వచ్చిందని జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని స్పష్టం చేశారు. 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తేల్చి చెప్పారు. అక్టోబర్ 23న రోజంతా పుతిన్ అధికారిక విధులను నిర్వర్తించారని, సాయంత్రం బ్రెజిల్ అధ్యక్షుడితోనూ ఫోన్‌లో మాట్లాడారని వెల్లడించారు. కాగా, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకరు. ఇంత వయసొచ్చినా పుతిన్ ఫిట్ నెస్ అద్భుతం. రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్‌ పుతిన్‌ ఆరోగ్య పరిస్థితిపై తరచూ అంతర్జాతీయ మీడియాలో ఈవిధమైన పుకార్లతో వార్తలు రావడం సర్వసాధారణంగా మారింది.

Also Read: Israel – US Army : రంగంలోకి అమెరికా ఆర్మీ ఎక్స్‌పర్ట్స్.. గాజాపై గ్రౌండ్ ఎటాక్‌కు ప్లానింగ్