Pro China President : మాల్దీవుల అధ్యక్షుడిగా చైనా మనిషి.. ఇండియాతో సంబంధాలపై ఎఫెక్ట్ ?

Pro China President : మాల్దీవులలో చైనా అనుకూల జెండా ఎగిరింది.

Published By: HashtagU Telugu Desk
Pro China President

Pro China President

Pro China President : మాల్దీవులలో చైనా అనుకూల జెండా ఎగిరింది. డ్రాగన్ కు అనుకూలంగా మాట్లాడే  45 ఏళ్ల మొహమ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  54.06 శాతం ఓట్లతో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ నేత మొహమ్మద్ ముయిజ్జు ఘన విజయం సాధించారు. ఆయనకు పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేశారు. మొహమ్మద్ ముయిజ్జు గెలుపు.. మాల్దీవులు, భారత్ మధ్య సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Also read : World Cup 2023: టీమిండియాను వెంటాడుతున్న సమస్య

‘‘అధ్యక్షుడిగా ఎన్నికైన ముయిజ్జుకు అభినందనలు. శాంతియుత, ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రదర్శించిన ప్రజలను నేను అభినందిస్తున్నాను’’ అని ప్రస్తుత అధ్యక్షుడు సోలిహ్ ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. 61 ఏళ్ల సోలిహ్..  తదుపరి అధ్యక్షుడిగా  మొహమ్మద్ ముయిజ్జు నవంబర్ 17న ప్రమాణ స్వీకారం చేసే వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే తూర్పు, పడమర షిప్పింగ్ లేన్‌లలో ఒకటైన హిందూ మహాసముద్రం మధ్యలో మాల్దీవులు (Pro China President)  ఉంది.

  Last Updated: 01 Oct 2023, 07:05 AM IST