Nepali Soldiers : నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ కీలక ప్రకటన విడుదల చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఆ రెండు దేశాల తరఫున ప్రైవేటు ఆర్మీల్లో నేపాలీలు పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. రష్యన్ ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ గ్రూపులో 200 మందికిపైగా నేపాలీలు ఉన్నారని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం కోసం కూడా కొందరు నేపాలీలు ఫైట్ చేస్తున్నారని తెలిపారు. అయితే తాము నేపాలీ సైనికులను రష్యా సైన్యంలోకి పంపడం లేదని స్పష్టం చేశారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే సాధారణ ప్రజలే అక్కడి కిరాయి సైన్యాల్లో చేరుతున్నారని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు చెందిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ తరఫున పోరాడిన ఆరుగురు నేపాల్ జాతీయులు ఇటీవల మరణించారు. ఈవివరాలను నేపాల్ ప్రధానమంత్రి ప్రచండ ధ్రువీకరించారు.
We’re now on WhatsApp. Click to Join.
రష్యా ఆర్మీలో నేపాలీలు..
- రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపులో చేరే నేపాలీ యువతకు(Nepali Soldiers) ప్రతినెలా రూ.4 లక్షల వరకు శాలరీ ఇస్తున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.
- చాలామంది నేపాలీలు రష్యాలోని ఫ్యాక్టరీలలో కాంట్రాక్టు కార్మికులుగా, సేల్స్ మెన్స్‌గా, రోడ్లపై మంచును తొలగించే కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది భారీ వేతనాలకు ఆశపడి రష్యా ఆర్మీలో చేరారు.
- నేపాలీలే కాదు.. ఎంతోమంది భారత్, పాకిస్థాన్, కాంగో, సూడాన్, అఫ్గాన్, సిరియన్, క్యూబన్ యువకులు కూడా రష్యా సైన్యంలో చేరారని అంటున్నారు.
- ఉక్రెయిన్‌పై యుద్ధంలో భారీగా సైనికులను కోల్పోయిన రష్యా మొదట తన జైళ్లలోని ఖైదీలను యుద్ధానికి పంపింది. ఆ తర్వాత విదేశీ కార్మికులు, డబ్బు సంపాదించాలని భావించే ఔత్సాహిక యువకులను ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపులోకి తీసుకుంది.
- కేవలం రెండువారాల సైనిక శిక్షణతోనే వారిని నేరుగా యుద్ధంలోకి దింపుతున్నారట.
Also Read: TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా