- ఒమన్ చేరుకున్న భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ
- భారత్ కంటే ఎక్కువ ఒమన్ దేశ కరెన్సీ విలువ
Oman: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మూడు దేశాల పర్యటనలో ఉన్నారు. జోర్డాన్, ఇథియోపియా సందర్శన తర్వాత ఆయన నేడు ఒమన్ చేరుకున్నారు. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత ఈ పర్యటన జరుగుతుండటం విశేషం. అంతకుముందు డిసెంబర్ 2023లో ఒమన్ సుల్తాన్ భారత్‌లో పర్యటించారు. ఒమన్ ఒక ముస్లిం దేశం. ఇక్కడి కరెన్సీ ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన కరెన్సీలలో ఒకటి. అమెరికా డాలర్ కూడా దీని ముందు బలహీనంగానే ఉంటుంది. సహజంగానే భారత రూపాయి కంటే దీని విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఒక ఒమానీ రియాల్ విలువ ఎంత?
ఒక ఒమానీ రియాల్ ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఒమానీ రియాల్ విలువ భారత కరెన్సీలో సుమారు 236 రూపాయలకు సమానం. అంటే ఎవరైనా భారతీయుడు ఒమన్‌లో కొన్ని వేల రియాల్‌ల జీతానికి పని చేసినా, భారత్ పంపేసరికి అది లక్షల రూపాయల ఆదాయంగా మారుతుంది.
10,000 రూపాయలతో ఒమన్‌లో ఎన్ని రోజులు గడపవచ్చు?
మీ దగ్గర 10,000 రూపాయలు ఉంటే అది ఒమన్ కరెన్సీలో కేవలం 42.29 ఒమానీ రియాల్స్ మాత్రమే అవుతుంది. ఈ మొత్తంతో మీరు ఒమన్‌లో కేవలం 1 నుండి 2 రోజులు మాత్రమే గడపగలరు. అది కూడా మీరు అతి తక్కువ ఖర్చుతో కూడిన వీధి ఆహారం తింటూ, మస్కట్‌లోని ఉచిత పర్యాటక ప్రాంతాలను సందర్శించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.
Also Read: కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీగా స్టైఫండ్ పెంపు!
ఒమన్‌లో నివాసం, రవాణా ఖర్చులు చాలా ఎక్కువ. సాధారణ ప్రయాణానికి కూడా రోజుకు సుమారు 60 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. 42 OMR అనేది సుమారు 110 డాలర్లకు సమానం. ఈ డబ్బుతో ఏదైనా బడ్జెట్ హోటల్ లేదా హాస్టల్‌లో ఉండటమే కష్టమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే.. మీరు చాలా పొదుపుగా ఉంటే ఒక రోజంతా లేదా అదృష్టం బాగుండి తక్కువ ధరకు హాస్టల్ దొరికితే గరిష్టంగా రెండు రోజులు ఉండగలరు. కానీ అది చాలా కష్టమైన పని. ఒక సౌకర్యవంతమైన పర్యటన కోసం మీకు ఇంతకంటే ఎక్కువ డబ్బు అవసరమవుతుంది.
ఒమానీ రియాల్ విలువ అంత ఎక్కువగా ఎందుకుంది?
ఒమన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం అక్కడి అపారమైన చమురు, సహజ వాయువు నిల్వలు. దీనివల్ల వారి ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా ఉంటుంది. అలాగే ఒమన్ వద్ద భారీ స్థాయిలో విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఒమన్ జనాభా చాలా తక్కువ. తక్కువ జనాభా కారణంగా అక్కడ తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది.
