ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రస్తుతం అమెరికా(America Tour)లో పర్యటిస్తున్నారు. గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్.. మోదీకి “Our Journey Together” అనే పుస్తకాన్ని గిఫ్ట్‌గా అందజేశారు. పుస్తకంపై “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ ఆర్ గ్రేట్” అని ట్రంప్ సంతకాలు చేసి ఉంది. 2020లో భారతదేశంలో తన పర్యటనలో తీసుకున్న ఫోటోలతో ఈ పుస్తకాన్ని అందించారు. ఈ పుస్తకంలో “హౌడీ మోదీ” మరియు “నమస్తే ట్రంప్” వంటి ముఖ్యమైన ఈవెంట్లకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి.
Uttam Kumar Reddy : రాష్ట్ర ప్రజల హక్కులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నాం
ఇక ట్రంప్.. ప్రధాని మోదీని “గ్రేట్ లీడర్” అని కొనియాడారు. మోదీ భారతదేశంలో గొప్పగా పనిచేస్తున్నారని, భారతదేశం మరియు అమెరికా మధ్య స్నేహబంధం కొనసాగుతుందని అన్నారు. “మిమ్మల్ని తిరిగి వైట్హౌస్‌లో చూడటం ఆనందంగా ఉంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన మోదీ చరిత్రాత్మక విజయాలను అభినందిస్తూ, ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపడానికి మోదీ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.
అలాగే ట్రంప్ యూఎస్ శక్తిని పట్ల కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “అమెరికా ఏ దేశాన్నైనా ఓడించగలిగే స్థితిలో ఉంది, కానీ మనం ఎవరినీ ఓడించాలని అనుకోవడం లేదని” పేర్కొన్నారు. అమెరికా గతంలో అద్భుతంగా పనిచేసిందని, కానీ గత నాలుగేళ్లలో భయంకరమైన పరిపాలన వల్ల తమ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం వచ్చిందని ట్రంప్ తెలిపారు. ఓవరాల్ గా ట్రంప్ ఇచ్చిన గిఫ్ట్ మరియు ఆయన చేసిన వ్యాఖ్యలు భారత-అమెరికా సంబంధాలను మరింత బలపరచాలని, ప్రపంచవ్యాప్తంగా శక్తి సమీకరణాలను ప్రభావితం చేసేలా మారనున్నాయని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.