వెనిజులాలో మరో భయానక విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టాచిరా రాష్ట్రంలోని పరమిల్లో విమానాశ్రయంలో చిన్నపాటి ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ తీసుకున్న క్షణాల్లోనే నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. సాక్షుల వివరాల ప్రకారం, విమానం ఎగరడం ప్రారంభించిన కొద్ది సెకండ్లలోనే ఎడమ వైపు ఒరిగి నేలపై బలంగా ఢీకొని తలకిందులైంది. వెంటనే భారీగా మంటలు చెలరేగి విమానం తునాతునకలైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయ సిబ్బంది, ఫైర్ సర్వీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే పరిస్థితి అదుపులో లేకుండా పోయింది.
Narayana Rao Commits Suicide : బాలికపై అత్యాచారం.. చెరువులో దూకి నిందితుడు ఆత్మహత్య
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, విమానం టేకాఫ్ సమయంలో టైర్ పేలడంతో పైలట్ నియంత్రణ కోల్పోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. టైర్ సడన్ బ్లాస్ట్ కావడంతో విమానం సమతుల్యత కోల్పోయి ఎడమవైపు ఒరిగి నేలపై బలంగా ఢీకొట్టిందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం సమయంలో విమానంలో పైలట్‌తో పాటు ఒక ప్రయాణికుడు మాత్రమే ఉన్నట్లు సమాచారం. విమాన శకలాలు పూర్తిగా దగ్ధమవడంతో గుర్తింపు కొంత కష్టమవుతుందని స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజలను కలచివేస్తోంది.
వెనిజులాలో ఇటీవలి కాలంలో చిన్న విమానాలతో జరిగే ప్రమాదాలు పెరుగుతున్నాయి. పాత విమానాలు, సరైన నిర్వహణ లేకపోవడం, మరియు వాతావరణ పరిస్థితులు కూడా ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్థానిక ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ఆదేశించింది. విమానాశ్రయ భద్రతా ప్రమాణాలను పునర్విమర్శించడంతో పాటు, టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ బృందాలు కారణాలను గుర్తించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ ప్రమాదం మరోసారి విమాన భద్రతా వ్యవస్థలపైనే ప్రశ్నలను లేవనెత్తింది.