Site icon HashtagU Telugu

President Vs Vice President : అవసరమైతే దేశాధ్యక్షుడినే చంపిస్తా.. ఫిలిప్పీన్స్‌ వైస్ ప్రెసిడెంట్ వార్నింగ్

Philippines President Vs Vice President Assassination Threats  sara Duterte And Ferdinand Marcos Jr

President Vs Vice President : ఫిలిప్పీన్స్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ సారా డ్యూటెర్టో ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఏకంగా దేశ ప్రెసిడెంట్ మాక్రోస్‌‌‌కు సంచలన వార్నింగ్ ఇచ్చారు.  ఒకవేళ తన ప్రాణాలకు ముప్పు ఏర్పడితే, నేరుగా దేశ అధ్యక్షుడిని చంపేందుకు ఏర్పాట్లు చేసి పెట్టానని ఆమె వెల్లడించడం కలకలం రేపింది. సారా డ్యూటెర్టో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఓ ఆన్‌లైన్‌ కామెంటర్‌.. ‘‘మీరు మీ రాజకీయ ప్రత్యర్థికి చెందిన ప్రదేశంలో ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి’’ అని వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సారా డ్యూటెర్టో  బదులిస్తూ.. ‘‘నేను కూడా ఒక వ్యక్తిని మాట్లాడి రెడీగా ఉంచాను. నేను ఎప్పుడు మర్డర్‌కు గురవుతానో,  అప్పుడే దేశ అధ్యక్షుడు మాక్రోస్‌, ఆయన భార్య లీజా, దేశ స్పీకర్‌ మార్టిన్‌ను కూడా మట్టుబెట్టాలని సుపారీ ఇచ్చేశాను. ఇది జోక్‌ కాదు నిజమే. నాకేమైనా అయితే.. వాళ్లందరినీ చంపేదాకా ఆగొద్దని ఆర్డర్ ఇచ్చాను. నా నుంచి సుపారీ తీసుకున్న వ్యక్తి అందుకు ఓకే చెప్పాడు’’ అని కామెంట్స్ చేశారు. వైస్ ప్రెసిడెంట్ సారా డ్యూటెర్టో ఇచ్చిన హత్య బెదిరింపులతో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు మాక్రోస్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయన చుట్టూ ఉండే సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను మరింత పెంచారు.  వైస్ ప్రెసిడెంట్ చేసిన కామెంట్స్‌పై సమగ్ర దర్యాప్తునకు పోలీస్‌ చీఫ్‌ రోమెల్‌ ఫ్రాన్సిస్కో(President Vs Vice President) ఆదేశాలు జారీచేశారు.

Also Read :Actor Ali : ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు.. కమేడియన్ అలీకి అధికారుల నోటీసులు

తన కామెంట్స్‌పై మరోసారి వైస్ ప్రెసిడెంట్ సారా స్పందిస్తూ..  ‘‘మీరు ఎంత ఆలోచించినా నా వార్నింగ్‌లోని పరమార్ధాన్ని గ్రహించలేరు. దాన్నిపసిగట్టలేరు’’ అని  పేర్కొన్నారు. ‘‘నా చావుపై దర్యాప్తు మొదలైన తర్వాతే ఏదైనా సాక్ష్యం దొరుకుతుంది. వారి చావులపై దర్యాప్తు ఆ తర్వాత మొదలవుతుంది’’ అని ఆమె ఇంకోసారి కామెంట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో కూడా సారా ఇలాగే కామెంట్స్ చేశారు. ‘‘నేను దేశ  అధ్యక్షుడి తల నరుకుతున్నట్లుగా ఊహించుకున్నాను’’ అని  వ్యాఖ్యానించారు.

Also Read :Jay Bhattacharya : అమెరికాలో మరో భారతీయుడికి కీలక పదవి.. ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా జై భట్టాచార్య!

దేశ వైస్ ప్రెసిడెంట్ కార్యాలయ బడ్జెట్‌‌ను తగ్గించాలని డిసైడ్ చేశారు. దీనిపై అప్పట్లో సారా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె నిప్పులు చెరిగారు. ఈక్రమంలోనే ఫిలిప్పీన్స్‌లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మధ్య గ్యాప్ పెరిగింది. ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టో కుమార్తె సారా. తన వద్ద డెత్‌ స్క్వాడ్‌లు ఉన్నాయని.. నేరగాళ్లను చంపేందుకు వాటిని వాడినట్లు ఆమె తండ్రి ఇటీవల ఓ విచారణలో వెల్లడించారు. ఇటీవలే  ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు, స్పీకర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.