Site icon HashtagU Telugu

56 Attacks : 250 కోట్ల డ్రోన్ కూల్చేశారు.. 56 దాడులు చేశారు : అమెరికా

56 Attacks

56 Attacks

56 Attacks : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం వేళ మిడిల్ ఈస్ట్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు పెరుగుతున్నాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ పక్షాన అమెరికా నిలుస్తోంది. ఈనేపథ్యంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లోని ఇరాన్ మద్దతు కలిగిన మిలిటెంట్ గ్రూపులు అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైళ్లు, రాకెట్లు సంధిస్తున్నాయి. అక్టోబరు 7న గాజాపై ఇజ్రాయెల్ సైనిక దాడులను ప్రారంభించింది. ఇది జరిగిన పది రోజుల తర్వాతి (అక్టోబరు 17) నుంచి ఇప్పటివరకు ఇరాక్, సిరియాలలోని అమెరికా దళాలపై స్థానిక మిలిటెంట్ గ్రూపులు 56 దాడులు చేశాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈవివరాలను స్వయంగా అమెరికా రక్షణశాఖ విభాగం పెంటగాన్ అధికారికంగా వెల్లడించింది. ఈ దాడుల్లో 59 మంది అమెరికా సైనికులు తీవ్ర గాయాలపాలయ్యారని తెలిపింది. అయితే తమ సైనికుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని స్పష్టం చేసింది. పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ విలేకరులకు ఈవివరాలను తెలియజేశారు. తమ అధునాతన డ్రోన్ ‘MQ-9 రీపర్’‌ను యెమన్ దేశంలోని హౌతీ మిలిటెంట్లు కూల్చేశారని అంగీకరించారు. దీనికి తగిన సమయంలో, తగిన సమాధానాన్ని అమెరికా ఇస్తుందని సబ్రీనా సింగ్ చెప్పారు.  హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్ వైపు సంధిస్తున్న ఎన్నో క్షిపణులను అమెరికా నౌకాదళం ఇజ్రాయెల్ సముద్రతీరంలోనే అడ్డుకుంటోందన్నారు. యెమన్ దేశంలోని హౌతీ మిలిటెంట్ గ్రూప్‌కు కూడా ఇరాన్ సపోర్ట్ ఉంది. ఇటీవల యెమన్ భూభాగంపై నిఘా కోసం చక్కర్లు కొడుతున్న అమెరికా అధునాతన డ్రోన్ ‘MQ-9 రీపర్’‌ను హౌతీ మిలిటెంట్లు కూల్చేశారు. ఈ డ్రోన్ ధర దాదాపు(56 Attacks) రూ.250 కోట్లు.

Also Read: Raw Food Benefits: వీటిని పచ్చిగా తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?

Exit mobile version