Site icon HashtagU Telugu

Pakistan : పాక్ ప్రజల పొట్టగొడుతున్న చైనా

Donkeys Get Costly Due

Donkeys Get Costly Due

ఆర్థిక మాంద్యంలో నలిగిపోతున్న పాకిస్థాన్‌(Pakistan )కు ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. అదే గాడిద(Donkeys)ల ధరల్లో ఊహించని పెరుగుదల. పాకిస్థాన్‌లోని పేద ప్రజలు గాడిదలపై తమ జీవనాధారంగా ఆధారపడుతున్నారు. ఇటుక బట్టీలు, వ్యర్థాల రవాణా, వ్యవసాయం, రీసైక్లింగ్ వంటి రంగాల్లో గాడిదలు ప్రధానంగా వినియోగంలో ఉంటాయి. కానీ ఇప్పుడు గాడిదల ధరలు పెరిగిపోవడం తో పేద కార్మికులు తీవ్ర కష్టాల్లో పడుతున్నారు. గతంలో రూ.30,000లో గాడిదలు దొరికేవి, ఇప్పుడు అదే గాడిద రూ.2 లక్షల దాకా ధర పలుకుతోంది.

Electricity Bill : కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వస్తుందా..? ఈ సింపుల్ టిప్స్‌ పాటిస్తే చాల తగ్గుద్ది ..!!

ఈ గాడిదల ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం చైనా (China ) సంస్థల డిమాండ్. చైనాకు చెందిన సంస్థలు గాడిదల చర్మం ద్వారా తయారు చేసే ఎజియావో అనే ఔషధ జెలటిన్ కోసం గాడిదలను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ జెలటిన్‌ను చైనీస్ సాంప్రదాయ వైద్యంలో శక్తివర్ధకంగా, రోగనిరోధక శక్తిని పెంచేదిగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. గాడిదల చర్మానికి అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా చైనా పాకిస్థాన్ మార్కెట్లలోకి వచ్చి రూ.1.5 లక్షల వరకు చెల్లించి గాడిదలను కొనుగోలు చేస్తోంది.

ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్‌లోని వేతన జీవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరాచీకి చెందిన అబ్దుల్ రషీద్ తన “టైగర్” అనే గాడిదను కోల్పోయాక దాని బదులుగా కొత్త గాడిదను కొనలేని స్థితిలో ఉన్నాడు. ఇతడు చెప్పినట్లుగా ఇప్పుడు గాడిద ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అతని పరిస్థితి ఒక్కడిదే కాదు. వందలాది మంది కార్మికులు ఇదే విధంగా జీవన పోరాటంలో కష్టపడుతున్నారు. ఇలా గాడిదల ధరలు పెరగడం ఒకవైపు చైనా డిమాండ్‌ను తృప్తి పరుస్తున్నా, మరోవైపు పాకిస్థాన్‌ పేద ప్రజల జీవనాధారాన్ని గడగడలాడిస్తోంది.